Friday, May 10, 2024

పసిడి ప్రియులకు షాక్..పెరిగిన బంగారం ధర..!!

spot_img

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. దేశీయంగా బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో వరుసగా ఐదో రోజూ బంగారం ధర పెరిగింది. చివరగా జనవరి 25న బంగారం ధర తగ్గుముఖం పట్టింది. అక్కడి నుంచి మళ్లీ ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 150 పెరిగి రూ. 58,300మార్కు వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో 24క్యారెట్ల బంగారం ధర రూ. 160 పెరిగి తులానికి రూ. 63,000 వద్ద ఉంది. గత ఐదు రోజుల్లో బంగారం ధర రూ. 650 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధర పెరిగింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 150 పెరిగి ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ. 58,450కు చేరింది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 160 ఎగబాకి రూ. 63,750 వద్ద ట్రేడ్ అవుతోంది

వెండి ధరలు కూడా పెరిగాయి. ఢిల్లీలో రూ. 200తగ్గగా ఇవాళ రూ. 200 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 76,500వద్ద ఉంది. హైదరాబాద్ లో వెండి ధర రూ. 200 పెరిగి ప్రస్తుతం రూ. 78వేల మార్కు వద్ద ట్రేడ్ అవుతోంంది.

ఇది కూడా చదవండి: ఈ తేదీలోపు ఫాస్టాగ్ ఈ-కేవైసీ అప్ డేట్ చేయకుంటే డీయాక్టివేషనే..!!

Latest News

More Articles