Sunday, April 28, 2024

చిత్రపరిశ్రమలో విషాదం..‘రాకీ’ ఫేం కార్ల్ వెదర్స్ ఇక లేరు..!!

spot_img

హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు కార్ల్ వెదర్స్ కన్నుమూశారు.’రాకీ’, ‘ప్రిడేటర్’ ‘ది మాండలోరియన్’ చిత్రాల్లో తన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు.కార్ల్ వెదర్స్‌కు భారత్ లోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కార్ల్ వెదర్స్ వయస్సు 76 ఏళ్లు. ఈ స్టార్ నటుడు కూడా స్పోర్ట్స్ ప్లేయర్ కూడా.

ప్రముఖ హాలీవుడ్ నటుడు కార్ల్ వెదర్స్ గురువారం మరణించినట్లు అతని మేనేజర్ ధృవీకరించారు. కార్ల్ వెదర్స్ అతని మేనేజర్ మాట్ లుబెర్ ప్రకారంజజజ ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కార్ల్ వెదర్స్ చలనచిత్రం,టెలివిజన్ ప్రపంచంలోనే కాకుండా క్రీడా ప్రపంచంలో చాలా ఫేమస్. కార్ల్ వెదర్స్ నటించిన రాకీ మూవీ ఆస్కార్ ను గెలుచుకుంది. ఈ మూవీ మూడు సీక్వెల్స్ వచ్చింది. ఈ మూడింటిలోనూ కార్ల్ వెదర్స్ కనిపించారు. కార్ల్ వెదర్స్ మరణవార్త విని సినీ పరిశ్రమే కాకుండా ఆయన అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

‘రాకీ’తో పాటు, ‘స్టార్ వార్స్’, ‘స్పినోఫ్’, ‘ది మాండలోరియన్’ 1987లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ హారర్ చిత్రం ‘ప్రిడేటర్’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ‘రాకీ’ సినిమాతో వెదర్స్‌కు మంచి పేరు వచ్చింది. ‘హ్యాపీ గిల్మోర్’లో ఆడమ్ సాండ్లర్ సరసన ఒన్ హ్యాండ్ గోల్ఫ్ కోచ్‌గా ఆడింది. కార్ల్ వెదర్స్ తన 50 ఏళ్ల స్క్రీన్ కెరీర్‌లో 75 కంటే ఎక్కువ సినిమాలు, టీవీ షోలలో కనిపించాడు.

ఇది కూడా చదవండి: పార్లమెంటులో వాటర్ వార్.. బీఆర్ఎస్ ఒంటరి పోరాటం.. వెనక్కి తగ్గిన కాంగ్రెస్, బీజేపీ

Latest News

More Articles