Saturday, May 4, 2024

వెంటనే గొర్రెల పంపిణి చేయాలి.. ప్రభుత్వానికి డిమాండ్

spot_img

ప్రభుత్వం యాదవ, కురుమ సోదరుల కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రారంభిం చిన గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం వెంటనే కొనసాగించాలన్నారు. గతంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో చాలా మంది డీడీలను కట్టారని గుర్తు చేశారు.

ఇక ఎలక్షన్ మ్యానిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే డీడీలు కట్టిన వారికి కలెక్టర్ ఖాతాలో డబ్బులు జమ చేయబడ్డాయని, అర్హులైన వారికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నిర్లక్షం చేయటం తగదని అన్నారు. తమకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయకపోతే తమ తడాఖా చూపిస్తామని బాలరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అయోధ్య యాదవ్, పుట్ట వీరేష్ యాదవ్, సూర్యనారాయణ, వెంకటేష్ యాదవ్, ర్యాకెల శ్రీనివాస్, కంకల మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles