Sunday, May 19, 2024

కాంగ్రెస్, బీజేపీ నాయకులు కుమ్మక్కై నన్ను ఓడించారు

spot_img

హైదరాబాద్: మహబూబ్ నగర్ లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కుమ్మక్కై  తనను ఓడించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పది ఏళ్లు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే… 10రోజుల్లో వచ్చిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎలా గెలిపించారో ప్రజలు ఆలోచించాలని కోరారు.

భూములు కబ్జా చేశారని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసి… యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి తమ్ముడు పలువురు నాయకులు కుట్రలు చేసి ఓడించారు. తాత్కాలికంగా గొంతును ఆపగలరని… భవిష్యత్తులో తన గొంతును ఆపలేరని అన్నారు. సర్వాయ్ పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం, నిధులు కేటాయించిందని, ఆగస్టులో వచ్చే పాపన్న గౌడ్ జయంతి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

కుల వృత్తుల కోసం ఏర్పాటు చేసిన ఆత్మగౌరవ భవనాలు కూడా పూర్తి చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ధి పనులను నూతన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో పూర్తి చేయాలని, లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించుకున్నామో… ఆ ఉద్యమ పోరాట పటిమతో అలానే సాధించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభలో పాల్గొన్న సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Latest News

More Articles