Friday, May 17, 2024

బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ ను ఎదుర్కోవడం ఓ లెక్కా?

spot_img

హైదరాబాద్: వైఎస్ రాజశేఖర్ రెడ్డి , చంద్రబాబునాయుడులను ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ ను ఎదుర్కోవడం ఓ లెక్కా? అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో జరుగుతున్న మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. రేవంత్ కు మోసపూరిత హామీలతో సీఎం పదవి వచ్చిందని, రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించినట్టే సీఎం గా పాలన నడుపుతున్నారని మండిపడ్డారు.

Also Read.. మహిళల ఫ్రీ బస్ జర్నీపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్స్

‘‘కేసీఆర్ త్వరలోనే వస్తున్నారు. కొత్త పరిష్కార మార్గాలతో బీఆర్ఎస్ ను ముందుకు నడిపిస్తారు. కార్యకర్తలు పాత విషయాలు మరచిపోయి పార్టీని బలోపేతం చేసేందుకు నడుం బిగించాలి. ఉద్యమంలో కార్యకర్తలు పడ్డ కష్టం ముందు రాబోయే కష్టాలు పెద్దగా లెక్కలోకి రావు. ఇక నుంచి దెబ్బకు దెబ్బ అన్నట్టుగా మన విధానం ఉండాలి.

Also Read.. లోక్‎సభ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీకి షాక్

కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాలు వెలకట్టలేనివి. కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి చెందాలని తపించి మిగతా విషయాలు పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టుగా పార్టీ తన స్వరూపాన్ని మార్చుకోవాలి. మన పార్టీలో కేటీఆర్, హరీష్ లాంటి సమర్థులున్నారు.’’ అని అన్నారు.

Latest News

More Articles