Thursday, May 2, 2024

పాస్‌పోర్ట్ ర్యాంకులు: ఇండియా స్థానం ఎంతో తెలుసా?

spot_img

న్యూఢిల్లీ: ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత శ‌క్తివంత‌మైన‌ పాస్‌పోర్టుల వివరాలను హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ వెల్లడించింది. ఇందులో ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, ఇట‌లీ, జ‌పాన్‌, సింగ‌పూర్‌, స్పెయిన్ దేశాల పాస్‌పోర్టులు టాప్ ర్యాంకులో నిలిచాయి. ఈ పాస్‌పోర్టులు ఉన్న‌వాళ్లు 194 దేశాల‌కు వీసా లేకుండానే సందర్శించవచ్చని నివేదిక పేర్కొంది.

Also Read.. ఫ్రెండ్స్‎తో దావత్.. గొంతులో చికెన్‌ ముక్క ఇరుక్కొని స్నేహితుడు మృతి

ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేష‌న్ ఇచ్చిన డేటా ఆధారంగా ఈ ర్యాంక్‌ల‌ను ప్ర‌క‌టించినట్లు సదరు సంస్థ తెలిపింది. ఫిన్‌ల్యాండ్, స్వీడెన్‌, సౌత్ కొరియా దేశాల పాస్‌పోర్టులు ఉంటే 193 దేశాల‌కు వీసా లేకుండా వెళ్ల‌వ‌చ్చు. ఆస్ట్రియా, డెన్మార్క్‌, ఐర్లాండ్‌, నెద‌ర్లాండ్స్ దేశాల పాస్‌పోర్ట్ ఉంటే 192 దేశాల‌లోకి వీసా లేకుండా ప్రవేశించవచ్చు. కాగా, తాజా ర్యాంకుల్లో ఇండియా పాస్‌పోర్ట్ 80వ స్థానంలో నిలిచింది. ఇండియా పాస్‌పోర్ట్ ఉన్న‌వాళ్లు 62 దేశాల‌కు వీసా లేకుండానే వెళ్లే అవకాశం ఉందని నివేదికలో తెలిపారు.

Latest News

More Articles