Saturday, May 4, 2024

యూట్యూబ్‌ ఇండియాకు నోటీసులు

spot_img

న్యూఢిల్లీ: యూట్యూబ్‌ ఇండియాకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. యూట్యూబ్‌లో కొన్ని ఛానళ్లు తల్లులు, కుమారులకు సంబంధించి అసభ్యకర వీడియోలు పోస్టు చేస్తుండటంపై ఎన్‌సీపీసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిపై యూట్యూబ్‌ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

Also Read.. ఫ్రెండ్స్‎తో దావత్.. గొంతులో చికెన్‌ ముక్క ఇరుక్కొని స్నేహితుడు మృతి

జనవరి 15న ఆయా ఛానళ్ల జాబితాతో యూట్యూబ్‌ ఇండియా ప్రతినిధి తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఇలాంటి అసభ్యకర కంటెంట్‌ను తొలగించేందుకు ఎలాంటి మెకానిజం వినియోగిస్తున్నారో చెప్పాలని కమిషన్‌ కోరింది.

Latest News

More Articles