Saturday, May 18, 2024

హర్భజన్ సింగ్ చెప్పినట్టే.. అదరగొట్టిన సూర్య

spot_img

న్యూఢిల్లీ: మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పినట్టే జరిగింది. 2023 ప్రపంచ కప్ భారత జట్టులో బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‍కు చోటివ్వడంపై  చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. టీ20ల్లో అదరగొడుతున్న సూర్యను వన్డే క్రికెట్‍లో సరైన ఫామ్‍లో లేడని, అతడిని వన్డే ప్రపంచ్ కప్ కోసం ఎలా జట్టులోకి తీసుకుంటారని ప్రశ్నించారు.  సూర్య బదులు సంజూ శాంసన్‍ను తీసుకోవాల్సిందని చాల మంది అభిప్రాయబడ్డారు.

Also Read.. 27 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్స్.. అదిరిపోయే ఆఫర్లు

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరిగి రెండు వన్డే మ్యాచుల్లోనూ సూర్య అదరగొట్టాడు. మొదటి వన్డేలో 50 పరుగులు, రెండో వన్డేలో భారీ సిక్సులు, ఫోర్లతో 37 బంతుల్లో 72 పరుగుల చేసి అందరి నోర్లు మూయించాడు. ఇటీవల స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పినట్టే సూర్య ప్రపంచ కప్ భారత జట్టులో చాల కీలకం కానున్నారు.ఈ మేరకు పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతూ.. హర్భజన్ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Latest News

More Articles