Sunday, May 19, 2024

ఇన్నేళ్లు గుర్తుకురాని పీవీ నరసింహారావు ఇప్పుడు గుర్తుకు వచ్చారా? కాంగ్రెస్ పై పీవీ కూతురు ఫైర్

spot_img

హైదరాబాద్: పీవీ నర్సింహారావు ఒక శక్తి. మైనార్టీ లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదుకొని, ఒక సంస్కరణ దిశగా భారత దేశాన్ని తీసుకెళ్లిన ఘనత పీవీ నర్సింహారావు ది అని కొనియాడారు పీవీ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీ దేవి అన్నారు. చివరి శ్వాస వరకు కూడా పీవీ నర్సింహారావు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారు. మరణానంతరం ఆయనపై ప్రపంచ దేశాలు సానుభూతి చూపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని పట్టించుకోలేదన్నారు. కళ్ళుండి చూడలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పీవీ నరసింహారావుకు న్యాయం చేశారు. కెసిఆర్ ఉద్యమం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కెసిఆర్ సుస్థిర పాలన, అభివృద్ది చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ఎవరెవరో వస్తుంటారు. వారి మాటలు నమ్మవద్దని కోరారు. ఇన్నేళ్లు గుర్తుకురాని పీవీ నర్సింహ రావు ఇప్పుడు గుర్తుకు వచ్చారా? కాంగ్రెస్కు అంటూ మండిపడ్డారు.

కొత్తగా కాంగ్రెస్ పార్టీకి పీవీ గుర్తొచ్చారా?: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి

కొత్తగా కాంగ్రెస్ పార్టీకి పీవీ గుర్తొచ్చారా? కడుపులో విషం పెట్టుకొని, పైన మాత్రం తియ్యగా మాట్లాడుతున్నారంటూ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి.. ప్రియాంక గాంధీపై మండిపడ్డారు. పీవీ నరసింహారావు చనిపోయినప్పుడు కనీసం పార్టీ ఆఫీస్ కి భౌతిక కాయం తీసుకు రానివ్వలేదని, కనీసం నివాళులు అర్పించడానికి కూడా సోనియా గాంధీ పార్టీ నేతలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ లో ఆనాడు ఒక్క ఫోటో కూడా పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. పీవీ నరసింహారావు కు గౌరవం కల్పించింది కేసిఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.

Latest News

More Articles