Sunday, May 19, 2024

కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చిన ప్రతి సారి ముస్లింలను మోసం చేసింది

spot_img

గత 10 ఏళ్ల కాలం లో బీఅర్ఎస్ చేసిన అభివృద్ధి మీకళ్ళ ముందే ఉంది. అర్బన్ ఎమ్మేల్యే గణేష్ గుప్తా చేసిన అభివృద్ధి కి నేనే సాక్షమన్నారు మంత్రి కేటీఆర్. నిజామాబాద్ జిల్లా ఖిల్లా రోడ్ లో ఎమ్మేల్యే గణేష్ గుప్తా తో కలిసి రోడ్ షో లో పాల్గొని మాట్లాడారు మంత్రి కేటార్. హైదరాబాద్ ట్యాంక్ బాండ్ కు దీటు గా నిజామాబాద్ లో ట్యాంక్ బాండ్ ఏర్పాటు చేశారు. నగరంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అండర్ గ్రౌండ్ పనులు పూర్తి చేసాం. ప్రజలు కష్టాల్లో ఉన్న కరోనా సమయంలో సొంత డబ్బు తో గణేష్ గుప్తా సేవలు అందించారు. తెలంగాణలో 10 ఏండ్లలో ఒక్క మత ఘర్షణ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మత పరంగా ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తోంది. కామారెడ్డి లో పని చేయలేని షబ్బీర్ అలీ నిజామాబాద్ లో ఏం పని చేస్తాడని విమర్శించారు. కామారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని అన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ను నమ్ముకుంటే కష్ట కాలం తప్ప ఒరిగేది ఏమి లేదు

12వేల కోట్ల రూపాయల నిధులు మైనారిటీ సంక్షేమం కోసం ఖర్చు చేశామన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ వంటి మైనార్టీ గురుకులాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ముస్లింలు అత్యధికం గా ఉన్న యూపీ,మహారాష్ట్ర,కర్ణాటకలో కూడా ఇవ్వనన్ని నిధులు సీఎం కేసీఆర్ తెలంగాణ లో ఇచ్చారు. ప్రతీ ఏడాది వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తామన్నారు. సీఎం పీఠం కోసం మత ఘర్షణలు చేసే కాంగ్రెస్ పార్టీ కి అధికారం ఇద్దామా ఆలోచన చేయాలని ప్రజలను కోరారు. మైనారిటీలు నిరుపేదలుగా ఉన్నారని రాహుల్ గాంధీ ఈరోజు అంటున్నాడు. 11సార్లు అవకాశం ఇస్తే ఎందుకు వారి అభివృద్ధి కోసం పని చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి అవకాశం ఇచ్చిన ప్రతి సారి ముస్లింలను మోసం చేసిందన్నారు.

బీఅర్ఎస్ పార్టీ చరిత్ర లో బీజేపీతో జత కట్టలేదు,భవిష్యత్ లో కూడా జత కట్టదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ,బీజేపీ లకు భయపడేది లేదన్నారు.పొరపాటున కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీకి  ఓటు వేస్తే ఆయన మళ్లీ ఎక్కడ కూడా కనపడడు.11 సార్లు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కు మళ్లీ ఓటు వేస్తే బీజేపీకి ప్రయోజనం అవుతుందన్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెసోళ్లు లీడర్లను కొనొచ్చు..కానీ ప్రజలను కొనలేరు

Latest News

More Articles