Monday, May 20, 2024

ఉతికారేసిన శుభ్‌మ‌న్, సాహా.. ల‌క్నోపై గుజ‌రాత్ విజ‌యం

spot_img

డిఫెండింగ్ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ ఈరోజు జరిగిన మ్యాచులో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌పై 56 ప‌ర‌గుల తేడాతో విజయం సాధించింది. తొలుత‌ ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్ 94 నాటౌట్ (51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు),  81 (43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) తుపాన్ ఇన్నింగ్స్ ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల న‌ష్టానికి 227 ప‌రుగులు చేసింది. ల‌క్నో బౌల‌ర్ల‌లో అవేశ్ ఖాన్, మొహ్సిన్ ఖాన్ చెరొక వికెట్ తీశారు.

227 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ల‌క్నో బ్యాట‌ర్ల‌లో క్వింట‌న్ డికాక్(70), కైల్ మేయ‌ర్స్(48) మాత్ర‌మే రాణించారు. దీప‌క్ హుడా(11), స్టోయినిస్(4) విఫ‌ల‌మ‌య్యారు. ల‌క్నో నిర్ణీత ఓవర్లలో 171 ప‌రుగుల‌ మాత్రమే చేయగలిగింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో మోహిత్ శ‌ర్మ నాలుగు, ష‌మీ, నూర్ అహ్మ‌ద్, ర‌షీద్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు.

Latest News

More Articles