Sunday, May 19, 2024

కవిత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచార‌ణ 28కి వాయిదా

spot_img

దర్యాప్తు సంస్థలు మహిళలను ఇంట్లోనే విచారించాలనే అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. మద్యం కేసులో విచారణకు రావాలని ఈడీ జారీ చేసిన నోటీసులను గతేడాది కవిత సవాలు చేశారు. గతంలో ఆమె పిటిషన్‌ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో జత చేసింది.  పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపట్టనున్నట్లు ఇవాళ(శుక్రవారం) జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. మూడు కేసులు వేర్వేరు అని, కలిపి విచారణ చేయడం సబబు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: మూడు నెల‌లు చికెన్ షాపులు బంద్

Latest News

More Articles