Saturday, May 11, 2024

దేశవ్యాప్తంగా ఘనంగా హోలీ పండుగ సంబురాలు.!

spot_img

దేశవ్యాప్తంగా హోలీ పండుగ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ హోలీ సంబురాల్లో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు.ప్రతిఒక్కరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఆనందాల రంగుల పండుగ దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో హోలీకి పలు రకాల పేర్లు ఉన్నాయి. ఫాగువా, ధూలెండి, ధులివందన్, డోల్ పేర్లతో ఈ హోలీ సంబురాలు జరుగుతున్నాయి.అంతేకాదు హోలీ రోజు దేవుళ్లను పూజిస్తారు. మధుర-బృందావన్ నుండి కాశీ, ఉజ్జయిని వరకు హోలీ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు.

హోలీ రోజు శివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాశీలో అంటే బనారస్‌లో, పైర్ల బూడిదతో హోలీ ఆడతారు. దీనిని మసానే హోలీ అంటారు. ఉజ్జయినిలో కూడా, హోలీ రోజున మహాకాళ భస్మ ఆరతి నిర్వహిస్తారు. హోలీ రోజున శ్రీకృష్ణుడు, రాధా రాణి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున రాధా, క్రుష్ణుడిని పూజించడం వల్ల వైవాహిక జీవితంలో ప్రేమ, సంతోషం కొనసాగుతుందని నమ్ముతారు. హోలీ రోజున విష్ణువు, లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. హోలీ రోజున, విష్ణువు నరసింహ అవతారాన్ని కూడా పూజిస్తారు.

హోలీ రోజున ఏమి చేయకూడదు?
-వివాహం అయిన మహిళలు గాజులు, కుంకుమ, ఎవరికీ దానం చేయకూడదు.
-బట్టలు దానం చేయరాదు. ఇలా చేస్తే ఇంట్లో పేదరికం వస్తుంది.
-తెల్లనివస్తువులు పాలు, పెరుగు, పంచదార దానం చేయకూడదు.
-ఆవనూనె దానం చేయవద్దు.
-డబ్బు, ఇనుము, ఉక్కు, గాజు వస్తువులను దానం చేయరాదు.

హోలీ రోజు ఏం చేయాలి?
-హోలీ రోజున, స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించిన తర్వాత, ముందుగా దేవుళ్లను పూజించాలి.
-హోలీ రోజున రాధా-కృష్ణులను తప్పకుండా పూజించండి
-హోలీ రోజున లక్ష్మీ దేవికి ఎరుపు గులాల్, పువ్వులు మొదలైనవి సమర్పించండి.
-అలాగే హోలీ రోజున శివలింగాన్ని పూజించండి.

ఇది కూడా చదవండి : నేడే చంద్రగ్రహణం..ఈ జాగ్రత్తలు తీసుకోవల్సిందే. !

Latest News

More Articles