Sunday, April 28, 2024

ఉజ్జయిని గర్భగుడిలో అగ్నిప్రమాదం.. తృటిలో తప్పించుకున్న సీఎం కుమారుడు, కుమార్తె.!

spot_img

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాల్ ఆలయంలో ఘోర ప్రమాదం జరిగింది. భస్మ హారతి సందర్భంగా ఈ ప్రమాదం సంభవించింది. గర్భగుడిలో భస్మ హారతి సందర్భంగా జరిగిన ఈ ప్రమాదంలో పదులో సంఖ్యలో భక్తులు మంటల్లో చిక్కుకున్నారు. హోలీ పండుగ సందర్భంగా ఆలయంలో గులాల్ విసిరారు. దాని కారణంగా మంటలు వ్యాపించాయి. మంటల్లో చికుక్కున్న భక్తులు, పూజారులు తీవ్రగాయాలయ్యాయి. వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదంలో సీఎం మోహన్ యాదవ్ కుమారుడు, కుమార్తె తృటిలో తప్పించుకున్నారు. ఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే ఉన్నారు. ఈ ప్రమాదంలో మహాకాల్ దేవాలయంలో భస్మర్తి ప్రధాన పూజారి సంజయ్ గురు, వికాస్ పూజారి, మనోజ్ పూజారి, అన్ష్ పురోహిత్, సేవకుడు మహేష్ శర్మ, చింతామన్ గెహ్లాట్ సహా పలువురు గాయపడ్డారు. పూజారి ఆశిష్ శర్మ మాట్లాడుతూ, ‘మహాకాల్ ఆలయంలో సాంప్రదాయ హోలీ వేడుకలు నిర్వహిస్తున్నారు. గులాల్ కారణంగా గర్భగుడిలో మంటలు వ్యాపించాయి. ఆలయ పూజారికి గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవు.. రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు వార్నింగ్.! 

Latest News

More Articles