Saturday, May 4, 2024

బడ్జెట్ ధరలోనే హానర్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్లు ఇవే..!!

spot_img

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు సంస్థ అయిన  హానర్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూకుడుగా వ్యవహారిస్తోంది. గత కొన్ని నెలల్లో హానర్ అనేక స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇటీవలే కంపెనీ భారత్ లో  Honor X9bని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ నేటి నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇంతలో కంపెనీ త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ హానర్ మ్యాజిక్ 6 ప్రోని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

హానర్ మ్యాజిక్ 6 ప్రో ఒక ప్రీమియం స్మార్ట్‌ఫోన్. ఇది ఒకటి లేదా రెండు మాత్రమే కాకుండా అనేక శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. హానర్ గత నెలలో చైనా మార్కెట్లో మ్యాజిక్ 6 సిరీస్‌లో వచ్చే హానర్ మ్యాజిక్ 6 ప్రోని పరిచయం చేసింది. ఇప్పుడు కంపెనీ తన గ్లోబల్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. లీక్ అయిన నివేదిక ప్రకారం, హానర్ ఈ నెలలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌లో ‘హానర్ మ్యాజిక్ 6 ప్రో’ గ్లోబల్ లాంచ్‌ను ప్రారంభించవచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఈ స్మార్ట్‌ఫోన్ IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కూడా గుర్తింపు పొందింది.

ధర :
హానర్ మ్యాజిక్ 6 ప్రో ధర గురించి మాట్లాడినట్లయితే, కంపెనీ దీనిని ఫ్రాన్స్, ఇటలీలో సుమారు రూ. 1,15,888కి లాంచ్ చేయవచ్చు. అయితే UK మార్కెట్లో దీని ధర 1099.99 పౌండ్‌లు అంటే దాదాపు రూ. 1,14,590. కంపెనీ దీనిని గ్రీన్ , బ్లాక్ అనే రెండు రంగుల ఎంపికలతో అందించవచ్చు. ఇందులో, వినియోగదారులు 16జిబి ర్యామ్, 1TB స్టోరేజ్ పొందవచ్చు.

ఫీచర్లు:
-హానర్ మ్యాజిక్ 6 ప్రోలో, వినియోగదారులు 6.8 అంగుళాల ఫుల్ ఎడ్జ్డ్ ప్లస్ కర్వ్డ్ డిస్‌ప్లేను పొందవచ్చు.

-డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్,2800×1280 రిజల్యూషన్‌తో OLED LTPO ప్యానెల్‌తో వస్తుంది.

-హానర్ మ్యాజిక్ 6 ప్రోలో, కస్టమర్‌లు Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌ని పొందవచ్చు.

– 16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజీని పొందవచ్చు.

-హానర్ మ్యాజిక్ 6 ప్రో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందించబడింది.

-దీనికి 50+50 మెగాపిక్సెల్‌లతో 180మెగాపిక్సెల్ పెరిస్కోప్ అల్ట్రా టెలిఫోటో లెన్స్‌ను కూడా ఇవ్వవచ్చు.

– సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 50మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది.

-కంపెనీ 56000ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. మీరు దీన్ని 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఛార్జ్ చేయగలుగుతారు.

ఇది కూడా  చదవండి: జర్మనీ వెళ్ళిన ఐకాన్ స్టార్.. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అరుదైన అవకాశం..!!

Latest News

More Articles