Friday, May 3, 2024

ఏపీలో భారీగా డ్రగ్స్ పట్టివేత.!

spot_img

విశాఖలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. భారీ ఎత్తున డ్రగ్స్ ను సీ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్ పోల్ ఇచ్చిన పక్కా సమాచారంతోనే సీబీఐ చేపట్టిన గరుడులో భాగంగా సీపోర్టు అధికారులు 25వేల కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బ్రెజిల్ నుంచి జర్మనీలోని హ్యాబర్గ్ మీదుగా ఈ నెల 16న విశాఖ తీరంలో ఓ ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కు ఓ కంటైనర్ చేరుకుంది. పక్కా సమాచారం తో ఢిల్లీ సీబీఐ టీం విశాఖ సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ఆ కంటైనర్ ను చెక్ చేశారు. డ్రై ఈస్ట్ మిక్స్ చేసి సుమారు వెయ్యి బ్యాగుల్లో ముఠా డ్రగ్స్ ను తరలిస్తున్నట్లుగా గుర్తించారు. కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో బ్యాగులో 25కేజీల చొప్పున డ్రగ్స్ ప్యాక్ చేసి ఉంచినట్లుగా సమాచారం. అయితే కంటైనర్ విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ ఉండటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆ అడ్రస్ ఆధారంగానే కేసు నమోదు చేసి సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది.

ఇందులో మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంఫటేమిన్, మెస్కలిన్ వంటి నిషేధిత డ్రగ్స్ ఉన్నట్లు తేలింది. ర్యాండమ్ గా తనిఖీ చేసిన మరో 20 ప్యాకెట్లలోనూ కొకైన్, మెథాక్వలోన్ అనే రెండు రకాల డ్రగ్స్ ఉన్నట్లు తేలింది. ఒక్కో బ్యాగులో ఎంత మేర డ్రగ్స్ ఉన్నాయనే లెక్క తేల్చాల్సి ఉందని అధికారులు తెలిపు. ఈ డ్రగ్స్ అత్యంత ఖరీదైనవిగా చెబుతున్నారు అధికారులు. ఒకవేల 25వేల కిలోల్లో భారీ మోతాదులో డ్రగ్స్ లభిస్తే రూ. లక్షల కోట్ల డ్రగ్స్ రాకెట్ గా ఈ కేసు నిలుస్తుందని చెప్పారు. ఇందులో అంతర్జాతీయ నేరముఠా ప్రమేయం ఉండవచ్చని సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఇది కూడా చదవండి: ఈడీ కార్యాలయంలో కేజ్రీవాల్..వైద్య పరీక్షలు పూర్తి.!

Latest News

More Articles