Sunday, April 28, 2024

మహిళలకు షాక్..ఒక్కరోజే రూ. 1,130 పెరిగిన బంగారం ధర.!

spot_img

బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. దీంతో గురువారం రికార్డు స్థాయికి చేరుకుంది. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో పది గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,130 పెరిగి ఆల్ టైమ్ రికార్డును తాకింది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా రూ. 67,450 వద్ద నిలిచింది. హైదరాబాద్ లోనూ రూ. 1,090 పుంజుకుని రూ. 67,420 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు బలంగా ఉన్న నేపథ్యంలో మదుపరులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. ఏవైనా ఒడుదొడుకుల నుంచి తమ పెట్టుబడులకు రక్షణగా బంగారాన్నే ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే బంగారం ధరలు ఇంతలా పెరిగాయని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఔన్సు 2,202 డాలర్లుగా పలికింది. ఒక్కరోజే ఏకంగా 48 డాలర్లు పెరిగింది. అయితే భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారంను విపరీతంగా కొంటున్నాయి. దీంతో బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. అంటు వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,100 పెరిగింది. రూ. 77,750కి చేరింది. హైదారాబాద్ లో ఇది రూ. 78,500గా నమోదు అయ్యింది. బుధవారంతో పోల్చితే రూ. 1500పెరిగింది.

ఇది కూడా చదవండి: కన్నతల్లి కర్కశత్వం..మూడోసారి ఆడపిల్ల పుట్టిందని..

Latest News

More Articles