Monday, June 24, 2024

హైదరాబాద్ టూ కాశీ.. IRCTC స్పెషల్​ టూర్..పూర్తి వివరాలివే.!

spot_img

వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది పుణ్యక్షేత్రాలు, లేదంటే ఇతర టూరిస్టు ప్రదేశాలను సందర్శించేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా చాలా మంది పుణ్యక్షేత్రాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకునేందుకు ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా ఈ సమ్మర్ లో దైవదర్శనం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఐటీసీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది.

విహారయాత్రలకు వెళ్లవారి కోసం స్పెషల్ టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ఇప్పటికే పర్యాటక ప్రాంతాలు, దర్శనీయ స్థలాలను కవర్ చేస్తూ అనేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఆధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకునేవారి కోసం ఐఆర్ సీటీసీ మరో ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి గంగా రామాయణ్ యాత్ర పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఈ టూర్ ఎన్నిరోజులు ఉంటుంది. ఏయే ప్రదేశాలు చూడవచ్చు. టూర్ ధర ఎంత ..పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ గంగా రామాయణ్ ప్యాకేజీలో నైమిశారణ్య, ప్రయాగ్ రాజ్, సారనాథ్, వారణాసి పుణ్యక్షేత్రాలను సందర్శించుకుని దర్శించుకోవచ్చు. ఈ యాత్ర 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి విమానంలో వారణాసికి చేరుకోవడంతో ఈ యాత్ర షురూ అవుతుంది. చివరి రోజు లక్ నవూ నుంచి హైదరాబాద్ రావడంతో టూర్ పూర్తవుతుంది. ఈ ప్యాకేజీ జులై 20 నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఐఆర్ సీటీసీ తెలిపింది.

ప్యాకేజీ ఛార్జీలు.. (ఒకరికి)
సింగిల్‌ ఆక్యుపెన్సీ- రూ.39,400
డబుల్‌ ఆక్యుపెన్సీ- రూ.31,000
ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ- రూ.29,850
చైల్డ్‌ విత్‌ బెడ్‌ (5- 11ఏళ్లు)- రూ.27,650
చైల్డ్‌ వితౌట్‌ బెడ్‌ (5- 11ఏళ్లు)- రూ.23,050
చైల్డ్‌ వితౌట్‌ బెడ్‌ (2- 4ఏళ్లు)- రూ.17,400

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తోందంటూ బీఆర్ఎస్ సంచలన ట్వీట్.!

Latest News

More Articles