Friday, May 17, 2024

ప్రపంచ కప్ చరిత్ర: భారత టాప్ 10 బ్యాటర్లు, వికెట్ టేకర్స్ గురించి తెలుసా?

spot_img

న్యూఢిల్లీ:  పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ అక్టోబర్ 5న ప్రారంభమవుతుంది. 2019 ప్రపంచ కప్ ఫైనల్ లో తలపడిన ఇంగ్లండ్- న్యూజిలాండ్‌ మ్యాచ్ తో టోర్నీ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది. టోర్నీలో భాగంగా అక్టోబర్ 14న భారత్-పాకిస్తాన్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగనుంది. రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో.. నవంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతాయి. భారతదేశం ఈ టోర్నమెంట్‌లోకి ఫేవరెట్‌లలో ఒకటిగా బరిలోకి దిగుతుంది. ప్రపంచ కప్ ప్రారంభం కావడానికి ముందు, గత ఎడిషన్లలో భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారి వివరాల గురించి చూస్తే..

Also Read.. పాకిస్థాన్ లో భయంకరమైన ఆర్గాన్-ట్రాఫికింగ్ రాకెట్‌ గుట్టురట్టు

ప్రపంచకప్‌లో భారత్ తరఫున టాప్ 10 రన్స్ చేసిన బ్యాటర్లు:

  1. సచిన్ టెండూల్కర్: ప్రపంచ కప్‌లో చరిత్రలో అత్యధిక పరుగుల చేసిన బ్యాటర్ గా నిలిచాడు. అతను 45 మ్యాచ్‌ల్లో 56.95 సగటుతో 2,278 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు , 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
  2. విరాట్ కోహ్లీ : భారత ఆటగాళ్ల పరంగా కోహ్లీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 26 మ్యాచ్‌లు ఆడి 46.81 సగటుతో 1,030 పరుగులు చేశాడు.
  3. సౌరవ్ గంగూలీ: 21 మ్యాచ్‌ల్లో 55.88 సగటుతో 1,006 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.
  4. రోహిత్ శర్మ: 17 మ్యాచ్‌ల్లో 65.20 సగటుతో 978 పరుగులు చేశాడు.
  5. రాహుల్ ద్రవిడ్: 22 మ్యాచ్‌లలో 61.42 సగటుతో 860 పరుగులు చేశాడు.
  6. వీరేంద్ర సెహ్వాగ్: 22 మ్యాచ్‌ల్లో 38.31 సగటుతో 843 పరుగులు చేశాడు. ఇందులో ప్రపంచ కప్‌లో అనేక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఉన్నాయి.
  7. మహ్మద్ అజారుద్దీన్ :1992 ప్రపంచకప్‌లో తొలిసారిగా భారత్‌కు నాయకత్వం వహించాడు. 25 ఇన్నింగ్స్‌లలో 39.33 సగటుతో 826 పరుగులు చేశాడు.
  8. MS ధోనీ: భారత్ కు 2011 ప్రపంచ కప్ అందించిన భారత కెప్టెన్. వికెట్ కీపర్-బ్యాటర్ అయిన ధోనీ 25 ఇన్నింగ్స్‌లలో 43.33 సగటుతో 780 పరుగులు చేశాడు.
  9. యువరాజ్ సింగ్: 2011 ప్రపంచ కప్ గెలిచిన టీంలో సభ్యుడు. 21 ఇన్నింగ్స్‌లలో 52.71 సగటుతో 738 పరుగులు చేశాడు.
  10. కపిల్ దేవ్: భారత్ కు తొలిసారి 1983 ప్రపంచ కప్ అందించిన కెప్టెన్. 24 ఇన్నింగ్స్‌లలో 37.16 సగటుతో 669 పరుగులు చేశాడు.

Also Read.. వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ కు కౌంట్‌డౌన్ స్టార్ట్

భారత్ తరఫున టాప్ 10 వికెట్లు తీసిన ఆటగాళ్లు:

  1. 2011 ప్రపంచకప్‌లో బంతితో ఆడిన జహీర్ ఖాన్ 23 మ్యాచ్‌లలో 20.22 సగటుతో 44 వికెట్లతో చార్టుల్లో అగ్రస్థానంలో ఉన్నాడు.
  2. భారతదేశపు ప్రముఖ ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన జవగల్ శ్రీనాథ్ 33 ఇన్నింగ్స్‌లలో 27.81 సగటుతో 44 వికెట్లతో జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు.
  3. ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు కీలకమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన మహ్మద్ షమీ, 11 ఇన్నింగ్స్‌లలో 15.70 సగటుతో 31 వికెట్లతో జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
  4. 2007 ప్రపంచ కప్ వరకు భారత ప్రపంచ కప్ జట్టులో ముఖ్యమైన పాత్ర పోషించిన అనిల్ కుంబ్లే 18 ఇన్నింగ్స్‌లలో 22.83 సగటుతో 31 వికెట్లు తీశాడు.
  5. 1983 ప్రపంచకప్‌లో ముందుండి నడిపించిన కపిల్ దేవ్ 25 ఇన్నింగ్స్‌లలో 28 వికెట్లతో ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.
  6. మనోజ్ ప్రభాకర్ 1987 నుండి 1996 ప్రపంచ కప్ వరకు భారత జట్టులో భాగంగా ఉన్నాడు. 18 ఇన్నింగ్స్‌లలో 26.66 సగటుతో 24 వికెట్లు తీశాడు.
  7. భారత జట్టులోని మరో కీలక సభ్యుడైన మదన్ లాల్.. 11 ఇన్నింగ్స్‌లలో 19.36 సగటుతో 22 వికెట్లు తీశాడు.
  8. 2011 ప్రపంచకప్‌లో భారతదేశానికి స్టార్ ఆల్‌రౌండర్‌గా నిలిచిన యువరాజ్ సింగ్.. 14 ఇన్నింగ్స్‌లలో 23.10 సగటుతో 20 వికెట్లు తీశాడు.
  9. హర్భజన్ సింగ్ 2003 నుండి 2011 ప్రపంచ కప్ వరకు భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 20 ఇన్నింగ్స్‌లలో 40.40 సగటుతో 20 వికెట్లు తీశాడు.
  10. రోజర్ బిన్నీ.. 80లలో భారతదేశపు కీలక ఆల్ రౌండర్లలో ఒకరు. 9 మ్యాచ్‌లలో 19 వికెట్లు తీశాడు.

Latest News

More Articles