Saturday, June 29, 2024

హ్యాట్రిక్ సిక్స‌ర్లతో అదరగొట్టిన అక్సర్ ప‌టేల్‌

spot_img

యువ ఆటగాళ్లతో కూడిన టీమ్‌ఇండియాకు.. శ్రీలంక చేతిలో పరాజయం ఎదురైంది. శ్రీలంక‌తో జ‌రిగిన రెండ‌వ టీ20 మ్యాచ్‌లో టాపార్డర్‌ వైఫల్యంతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‎లో అక్సర్ పటేల్ మాత్రం అటాకింగ్ ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. 31 బంతుల్లో అత‌ను 65 ర‌న్స్ స్కోర్ చేశాడు. దాంట్లో మూడు ఫోర్లు, ఆరు సిక్స‌ర్లు ఉన్నాయి. ఇండియాను దాదాపు విక్ట‌రీ ద‌శ‌కు చేర్చాడు. మ‌రో బ్యాట‌ర్ సూర్య‌కుమార్‌తో కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. అక్సర్, సూర్య ఆరో వికెట్‌కు 91 ర‌న్స్ జోడించారు. అయితే 14వ ఓవ‌ర్‌లో అక్సర్ త‌న విశ్వ‌రూపం చూపాడు. వ‌రుస‌గా మూడు సిక్స‌ర్ల‌తో చ‌ల‌రేగిపోయాడు. హ‌స‌రంగ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్స‌ర్లు కొట్టాడు. కేవ‌లం 20 బంతుల్లోనే అక్సర్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. చివ‌ర‌కు 16 ర‌న్స్ తేడాతో శ్రీలంక విజ‌యం సాధించింది.

https://twitter.com/PA1KTRS/status/1611045116202078209

‘నేను క్రీజులోకి వెళ్ళినప్పుడు సూర్య భాయ్‌తో మాట్లాడాను. మనం కొంచెం ప్రయత్నిస్తే మనకు గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు. దాంతో మేం ఓవర్‌కు 10 నుంచి 12 పరుగులు చేయడానికి ప్రయత్నించాం. ఒక రెండు ఓవర్లు కష్టపడితే గెలుపు అవకాశాలు లభిస్తాయని మాకు తెలుసు’ అని అక్సర్ అన్నాడు.

Latest News

More Articles