Friday, May 3, 2024

ఐపీఎల్ నుంచి మ్యాక్స్ వెల్ బ్రేక్..!

spot_img

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ IPL 2024 సీజన్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. నిరవధిక విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘోర పరాజయం తర్వాత మీడియాతో మాట్లాడిన మ్యాక్స్‌వెల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. మాక్స్‌వెల్ తన పేలవమైన ఫామ్ కారణంగా ఈ సీజన్‌లో చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. అతను సన్‌రైజర్స్‌తో జరిగిన ప్లే-11లో కూడా భాగం కాలేదు. ప్లేయింగ్-11లో అతని స్థానంలో విల్ జాక్వెస్ వచ్చాడు. మరొకరిని ప్రయత్నించమని కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను స్వయంగా కోరినట్లు మ్యాచ్ తర్వాత మ్యాక్స్‌వెల్ వివరించాడు.

విలేకరుల సమావేశంలో, మాక్స్వెల్ ప్రస్తుతం మానసిక, శారీరక స్థితి బాగా లేదని చెప్పాడు. అందుకే విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. అయితే ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్, ఈ లీగ్‌లో ఎంతకాలం ఆడను లేదా తదుపరి సీజన్‌లో కూడా అతను తిరిగి వస్తాడో లేదో చెప్పలేదు. ఏడు మ్యాచ్‌ల్లో RCB ఆరో ఓటమి తర్వాత మాక్స్‌వెల్ మాట్లాడుతూ ..ఇది నాకు వ్యక్తిగతంగా చాలా సులభమైన నిర్ణయం. నేను చివరి మ్యాచ్ తర్వాత ఫాఫ్ (డు ప్లెసిస్) కోచ్ వద్దకు వెళ్లి, బహుశా మనం వేరొకరిని ప్రయత్నించే సమయం వచ్చిందని నేను భావిస్తున్నాన్నట్లు చెప్పినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : బంపర్ డిస్కౌంట్..వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై ఏకం 5వేలు తగ్గింపు.!

Latest News

More Articles