Wednesday, May 1, 2024

బంపర్ డిస్కౌంట్..వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై ఏకం 5వేలు తగ్గింపు.!

spot_img

ప్రీమియం స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 11 5జీపై కంపెనీ మరింత డిస్కౌంట్ ను అందిస్తోంది. నెల వ్యవధిలోనే రెండు సార్లు ధరను తగ్గించింది. గతేడాది ఫిబ్రవరిలో ఈ పోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ రూ. 56,999వద్ద విడుదల చేసింది. ఈమధ్యే దీని ధరను కంపేనీ రూ. 2000 తగ్గించింది. తాజాగా మరో రూ. 3000 మేర తగ్గించింది. మొత్తం రూ. 5000 తగ్గి రూ. 51,999కే లభిస్తుంది. కంపెనీ గత సంవత్సరం తన వినియోగదారుల కోసం అత్యంత ఖరీదైన ఫోన్‌గా OnePlus 11ని పరిచయం చేసింది. ఈ ఫోన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. అయితే, కంపెనీ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌ల ధరను తగ్గించింది.మీరు ఈ ఫోన్‌ను టైటాన్ బ్లాక్, ఎటర్నల్ గ్రీన్ కలర్‌లలో కొనుగోలు చేయవచ్చు.

వన్ ప్లస్ 11 ఫీచర్లు:
ప్రాసెసర్ :
వన్ ప్లస్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 2 మొబైల్ ఫ్లాట్ ఫాం 5G చిప్‌సెట్‌తో వస్తుంది.

డిస్ప్లే :
ఈ ఫోన్ 6.7 అంగుళాల 120 Hz సూపర్ ఫ్లూయిడ్ ఆల్మోడ్ తో LTPO డిస్‌ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది.

ర్యామ్, స్టోరేజ్:
ఈ OnePlus ఫోన్ 8GB/16GB LPDDR5X RAM, 128GB UFS 3.1/256GB UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.

కెమెరా:
ఫోన్ Sony IMX890 50MP ప్రైమరీ, Sony IMX581 48 అల్ట్రా వైడ్, Sony IMX709 32MP టెలిఫోటో సెన్సార్‌తో వస్తుంది. ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ:
ఈ ఫోన్ లో 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. కేవలం 25 నిమిషాల్లోనే వంద శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.

ఇది కూడా చదవండి: రూ. 75వేలు దాటిన బంగారం..86వేలకు చేరిన వెండి..!

 

Latest News

More Articles