Wednesday, May 1, 2024

కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ అధినేత సంచలన వ్యాఖ్యలు..!

spot_img

తన రాజకీయ ఎదుగుదలలో మెతుకు సీమ మెదక్ ది కీలక పాత్ర అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలోని సింగూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే పార్లమెంట్ లో బీఆర్ఎస్ సభ్యులు ఉండాలన్నారు. మెదక్ జిల్లా ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే తెలంగాణ సాధించామన్న సంగతి గుర్తు చేశారు కేసీఆర్.

అంబేడ్కర్ను గుండెల్లో పెట్టుకోవాలనే సచివాలయం ఎదురుగా 125 అడుగుల విగ్రహన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆయన జయంతి రోజు విగ్రహం దగ్గరకు ఈ సర్కార్ రాలేదు. కనీసం పూలు పెట్టలేదు. నివాళులర్పించలేదు. నేను నిర్మించానని అంబేడ్కర్ విగ్రహం దగ్గరకు వెళ్లలేదు. మరి సచివాలయం కూడా నేనే నిర్మించాను కదా అందులో ఎందుకు కూర్చుకుంటున్నారు అని ప్రశ్నించారు. యాదాద్రి ఆలయం నేనే నిర్మించాను..ఆలయాన్ని మూసేస్తారా. అంబేడ్కర్ ను అవమానిస్తే చూస్తూ కూర్చుందామా అవమానించిన వారికి ఎన్నికల బుద్ధి చెప్పాలి. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పారు. నాలుగు నెలలు గడించింది. అయినా కూడా రుణమాఫీ ఊసేత్తలేదు. ఇప్పుడు ఆగస్టు 15లోపు అంటున్నారు. వెంటనే రూ. 2లక్షల రుణమాఫీ చేయాలి. దీనికోసం కాంగ్రెస్ ప్రభుత్వం పై యుద్దం చేద్దాం. రుణమాఫీ, వరికి బోనస్ కోసం పోస్టు కార్డు ఉద్యమం చేయాలని కేసీఆర్ అన్నారు.

ఇది కూడా చదవండి: జీలం నదిలో పడవ బోల్తా, ఆరుగురు విద్యార్థులు మృతి.!

Latest News

More Articles