Saturday, May 18, 2024

గాజాస్ట్రిప్‌పై అణుబాంబు.. మంత్రిని సస్పెండ్ చేసిన నెతన్యాహూ

spot_img

జెరూసలేం: హమాస్‌ను అంతమొందించేందుకు.. గాజాస్ట్రిప్‌పై పట్టు సాధించేందుకు ఇజ్రాయెల్‌ అణుబాంబు ప్రయోగించడానికి కూడా సిద్ధమన్న ఇజ్రాయెల్‌ మంత్రి అమిచాయ్‌ ఇలియాహుపై చర్యలు తీసుకున్నారు. ఓ రేడియో ఇంటర్వ్యూ సందర్భంగా అమిచాయ్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయిన విషయం తెలిసింది.

Also Read.. హైదరాబాద్‌ మెట్రో నయా రికార్డు

అతని వ్యాఖ్యలపై అధికార, విపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సదరు మంత్రిని ప్రభుత్వ సమావేశాల్లో పాల్గొనకుండా నిరవధికంగా సస్పెండ్‌ చేశారు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ. అంతర్జాతీయ చట్టాల్ని గౌరవిస్తూ హమాస్ ఉగ్రవాదులతో యుద్ధాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Also Read.. కొడంగల్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్

మరోవైపు శనివారం రాత్రి గాజాలోని మఘాజి శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు జరిపిన బాంబు దాడుల్లో కనీసం 40మంది పౌరులు చనిపోయారని గాజా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గాజాలో కాల్పుల విరమణ ప్రకటించాలని పలు దేశాలు డిమాండ్‌ చేశాయి.

Latest News

More Articles