Monday, May 20, 2024

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

spot_img

తెలంగాణ ప్రభుత్వంలోనే పారిశుద్ధ్య కార్మికులకు గుర్తింపు లభించిందని, బీఆర్ఎస్ హయంలోనే వారి జీతాలు పెరిగాయని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బాదేపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. అంతకుముందు మున్సిపాలిటీకి సంబంధించి నూతనంగా మంజూరు చేసిన రెండు చెత్త సేకరణ ఆటోలు, రెండు ట్రాక్టర్లు, ఒక వాటర్ ట్యాంకర్‎ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల నుంచే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు మరో రూ.1000 పెంచిందన్నారు. నాలుగు నెలల ఏరియర్స్‎కు సంబంధించిన డబ్బులు కూడా జమ చేయనున్నట్లు తెలిపారు. గతంలో పారిశుద్ధ కార్మికులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇల్లు లేని నిరుపేద కార్మికులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

రోజురోజుకు జడ్చర్ల పట్టణం అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా.. అక్కడక్కడ లో వోల్టెజ్ సమస్య ఏర్పడుతుందని, ఈ సందర్భంగా 3వ వార్డు సరస్వతీ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. 2014కు పూర్వం ఎండాకాలంలో కరెంటు లేక ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు, నేడు స్వరాష్ట్రంలో నిరంతర విద్యుత్ వెలుగులతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారన్నారు.

Latest News

More Articles