Saturday, May 4, 2024

హరీశ్ శంకర్ బాధ భరించలేకే ఆ డైలాగ్ చెప్పా:పవన్ కళ్యాణ్

spot_img

త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోజనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా ఉండటంతోనే సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అయితే హరీశ్ శకంర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి పవన్ డేట్స్ ఇవ్వకపోవడంతో దాన్ని పక్కనపెట్టేశారు. కానీ అనుకోకుండా నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ గ్లింప్స్ విడుదల చేశారు.

ఈ గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ గురించి చెబుతారు. గాజు పగిలేకొద్ది పదునెక్కుతుంది. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అనే డైలాగ్ చెబుతాడు . అయితే ఇది పొలిటికల్ కు ఉపయోగపడే విధంగా ఇప్పుడు ఈ గ్లింప్స్ ఆ గాజు డైలాగ్ తో విడుదల చేశారని తెలుస్తోంది. అయితే ఈ డైలాగ్ పై పవన్ కల్యాణ్ స్పందించారు. మంగళవారం రాత్రి జనసేన కార్యాలయంలో జరిగిన కార్యకర్తలతో మీటింగ్ లో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడారు.

పవన్ స్పందిస్తూ.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో ఓ క్యారెక్టర్ గ్లాస్ పడేస్తారు. ఈ రోజు వచ్చింది అనుకుంట గ్లింప్స్. ఆ గ్లాస్ ముక్కలు అయ్యింది. షూటింగ్ జరిగేటప్పుడు ఆ డైలాగ్ ఎందుకురాసావ్ అని హరీశ్ ను అడుగుతే..అందరూ మీరు ఓడిపోయారు..ఓడిపోయారు అంటే నేను ఒకటే చెప్పా గాజుకి ఉండే లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునెక్కుతుంది. మీకు తెలియదు మా లాంటి అభిమానులు ఇలాంటివి కోరుకుంటాడు అన్నాడు. నాకు ఇలాంటివి చెప్పడం ఇష్టమన్నాడు. కానీ హరీశ్ శంకర్ బాధ భరించలేకే ఆ డైలాగ్ చెప్పాను అన్నారు పవన్ కల్యాణ్. ఇప్పుడా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి: నన్ను క్షమించండి..క్షమాపణ కోరిన కేంద్రమంత్రి.!

Latest News

More Articles