Thursday, May 2, 2024

నన్ను క్షమించండి..క్షమాపణ కోరిన కేంద్రమంత్రి.!

spot_img

బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కర్నాటక ప్రజలకు క్షమాపణ చెప్పారు. కర్ణాటక శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలను లేవనెత్తుతూ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు. తమిళనాడు నుంచి వచ్చే వ్యక్తి బాంబు పెట్టాడని, ఢిల్లీ నుంచి వచ్చే వ్యక్తి పాకిస్థాన్ జిందాబాద్ అంటాడని, కేరళ నుంచి వచ్చే వ్యక్తి యాసిడ్ దాడి చేస్తాడంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.దాంతో మంత్రి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్టు చేశారు. ఏం జరిగిందంటే..

నిందితుడు మల్నాడు వాసి అని గతంలో తమిళనాడులో క్రుష్ణగిరి అటవీ ప్రాంతాంలో ఆయుధాలను వినియోగించడంలో ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ప్రాథమికంగా తేలింది. దాంతో మంత్రి చేసిన కామెంట్స్ వైరలయ్యాయి. రాష్ట్ర సీఎం స్టాలిన్ అనుసరిస్తోన్న బుజ్జగింపు రాజకీయాలే కారణమంటూ కూడా విమర్శలు చఏశారు. ఈ ఆరోపణలపై స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. తన వ్యాఖ్యలు దుమారం రేపడంతో సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణలు కోరారు.

నేను చేసిన వ్యాఖ్యలు ఏ ఒక్క వర్గాన్ని ఉద్దేశించినవి కావని..తమిళనాడు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. క్రుష్ణగిరిలో ట్రైనింగ్ తీసుకున్న నిందితుడిని ఉద్దేశించి తాను మాట్లాడానని..అయితే తన మాటలు కొందిని బాధించాయన్న సంగతి అర్థమైందన్నారు. ఈ నెల ఒకటో తేదీన బెంగుళూరులోని బ్రూక్ ఫీల్డ్ లో ఉన్న రామేశ్వరం కెఫేలో బాంబు పేలిన ఘనటలో 9 మందికి గాయాలు అయిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: గర్భిణీలకు రూ.11,000.. ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి తెలుసా?

Latest News

More Articles