Sunday, May 19, 2024

జేఈఈ మెయిన్ సెషన్ -1 ప్రాథమిక కీ విడుదల

spot_img

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు ఈ పరీక్షలను నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ (NTA) నిన్న( మంగళవారం) రాత్రి కీని విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీలతో పాటు రెస్పాన్స్‌ షీట్‌లనూ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఈ కీ పై అభ్యంతరాలు ఉంటే ప్రతి ప్రశ్నకు రూ.200 ఫీజుతో ఈ నెల 8 వరకు ఛాలెంజ్‌ చేసే వెసులుబాటును కల్పించింది. 8న రాత్రి 11 గంటలు దాటితే అభ్యంతరాలను స్వీకరించరు. ఒకవేళ అభ్యర్థులు లేవనెత్తిన డౌట్స్ సరైనవే అయితే.. ఆన్సర్‌ కీని సవరించి తుది కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత తుది ఫలితాలను ప్రకటిస్తారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు జరిగిన జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షకు పరీక్ష 12,95,617మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 12,25,529మంది హాజరైయ్యారు.

ఇది కూడా చదవండి: ఆర్టీసి మనందరిది.. దానిని కాపాడుకోవాలి

 

 

 

Latest News

More Articles