Friday, May 3, 2024

ఏప్రిల్‌ 1న జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 అడ్మిట్‌ కార్డులు విడుదల

spot_img

జేఈఈ మెయిన్‌  రెండో సెషన్‌ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు  మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. ఏప్రిల్‌ 1న అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 పరీక్షలు వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 15 వరకు రోజూ రెండు సెషన్లలో దేశవ్యాప్తంగా 319 పట్టణాల్లో ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు. భారత్‌ అవతల 22 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఏప్రిల్‌ 4, 5, 6, 8, 9 తేదీల్లో పేపర్‌-1 పరీక్షను, పేపర్‌-2 ఏ (బీఆర్క్‌), పేపర్‌-2బీ (బీఆర్క్‌, బీప్లానింగ్‌) పరీక్షను ఏప్రిల్‌ 12న నిర్వహిస్తారు. అదే నెల 25న ఫలితాలు విడుదల అవుతాయి.

జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 గత జనవరిలో ముగిసింది. మొదటి విడుతలో 23 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ మార్కులు సాధించారు. వారిలో అత్యధికంగా తెలంగాణ నుంచి ఏడుగురు ఉన్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు చొప్పున 100 పర్సంటైల్‌ స్కోర్‌ చేశారు.

ఇది కూడా చదవండి: అన్నదాతకు అండగా కొప్పుల ఈశ్వర్‌ 36 గంటల రైతు భరోసా దీక్ష

Latest News

More Articles