Sunday, May 19, 2024

జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 దరఖాస్తులు ప్రారంభం

spot_img

జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి సంబంధించిన జేఈఈ మెయిన్‌ సెకండ్‌ సెషన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 2వ తేదీవరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించనున్నారు. మొదటి సెషన్‌కు సంబంధించిన పరీక్షలను జనవరి 24 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు ఎన్‌టీఏ నిర్వహించింది. ఇక రెండో విడత పరీక్షలను ఏప్రిల్‌ 1-15 తేదీల మధ్య నిర్వహించనున్నట్లు ఎగ్జామ్‌ క్యాలెండర్‌లో ఎన్‌టీఏ (NTA)తెలింది. దీనికి సంబంధించిన అడ్మిట్‌ కార్డులను పరీక్షలకు మూడు రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది.

జేఈఈ మెయిన్‌ ద్వారా దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్‌ఐటీ, ఐఐటీలు, సీఎఫ్‌టీఐలలో ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దీనికోసం ఏటా రెండుసార్లు జేఈఈ మెయిన్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఇప్పటికే మొదటి సెషన్‌కు సంబంధించిన పరీక్షలు ముగిశాయి. మరో రెండు వారాల్లో పరీక్ష ఫలితాలు రిలీజ్ కానున్నాయి.

ఇది కూడా చదవండి: తెలంగాణ మలి దశ అమరవీరుల కుటుంబాలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

Latest News

More Articles