Thursday, May 2, 2024

కేసీఆర్ స్టాలిన్ కేజ్రీవాల్ మమతా.. బీజేపీని ఆపే దమ్మున్న నాయకులు

spot_img

కాంగ్రెస్ పార్టీకి డబ్బుంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని, కాంగ్రెస్ పార్టీ తనకున్న 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ.. కాంగ్రెస్ పార్టీపైన బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని తెలిపారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లనే ఇండియా కూటమి చెల్లాచెదురు అవుతున్నది, కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బిజెపితో నేరుగా పోటీ పడాల్సి ఉన్న కాంగ్రెస్, ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పోటీ పడుతుంది. దీంతో బిజెపికి లాభం చేకూరుతుంది.

ఇండియా కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. నిజానికి బిజెపిని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉన్నది. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రి వాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులే దేశంలో బిజెపిని అడ్డుకోగలరు. బిజెపికి కాంగ్రెస్ ఏ మాత్రము ప్రత్యామ్నాయము కాదు అని అన్నారు కేటీఆర్.

KTR Says strong regional political parties can only control bjp power

Latest News

More Articles