Sunday, May 12, 2024

2 లక్షల సర్కారీ కొలువుల భర్తీపై కర్ణాటక కాంగ్రెస్‌ యూటర్న్‌!

spot_img

హైదరాబాద్: కాంగ్రెస్‌ అంటే మోసం.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్‌ చిత్తశుద్ధి ఏమిటో మరోసారి రుజువైంది. ఐదు గ్యారెంటీలతో కర్ణాటక ప్రజలకు ధోకా ఇచ్చిన హస్తంపార్టీ.. 2 లక్షల సర్కారీ కొలువుల భర్తీపై కూడా యూటర్న్‌ తీసుకొంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను నింపుతామన్న కర్ణాటక కాంగ్రెస్‌ మాటమార్చింది. ‘ఉద్యోగాలు ఇప్పుడు ఇవ్వలేం. ఐదేండ్లు ఉందిగా చూద్దాంలే’ అంటూ ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

అదే కాంగ్రెస్‌ తెలంగాణలో తొలి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ మాయమాటలు చెప్తున్నది. ఈ మాటలు నమ్మామో.. కర్ణాటక నిరుద్యోగుల్లాగే మన బిడ్డలూ ఆగమవుడు ఖాయం. 2004-14 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ భర్తీ చేసిన ఉద్యోగాలు 24,086. అందులో తెలంగాణ పది జిల్లాల వాటా 42 శాతం అనుకుంటే.. 10,116 ఉద్యోగాలే.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌ హయాంలో గడిచిన పదేండ్లలో (2014-23) 2,32,308 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వగా.. ఇప్పటివరకూ 1,60,083 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయింది. మరో 42,652 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ పాలనలో ఏడాదికి సగటున 1,012 ఉద్యోగాలు భర్తీ జరిగితే.. బీఆర్‌ఎస్‌ పాలనలో 2014 తర్వాత ఏడాదికి సగటున 16,850 ఉద్యోగాలను భర్తీ చేయడం గమనార్హం.

Latest News

More Articles