Sunday, April 28, 2024

ఎవరో ఒక్కరికే రైతు భరోసా.. మోసాన్ని తనంతట తానే బయటపెట్టిన రేవంత్!

spot_img

హైదరాబా: అబద్ధాన్ని ఎల్లకాలం దాచలేరు. అందర్నీ అన్నిసార్లూ మోసం చేయలేరు. తెలంగాణ రైతులకు భరోసా అంటూ కాంగ్రెస్‌ చేసిన ‘గ్యారెంటీ’ మోసం గుట్టు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ నోటే బయటకు వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ, పాత్రికేయుడు ప్రొ.నాగేశ్వర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్‌ రైతు భరోసా మోసాన్ని తనంతట తానే బయటపెట్టారు.

కాంగ్రెస్‌ ఆరు హామీల్లోని డొల్లతనం ఒక్కొక్కటిగా బయటపడుతున్నది. కాంగ్రెస్‌ హామీలన్నీ మోసమేనని సీఎం కేసీఆర్‌ చెప్తున్నది నిజమేనని పోలింగ్‌కు ముందే తేలిపోతున్నది. రైతు భరోసా కింద ఆర్థికసాయం భూ యజమాని, కౌలుదారుల్లో ఎవరో ఒక్కరికే ఇస్తామని రేవంత్‌ ప్రకటించారు. ‘రైతు భరోసా సాయం రైతు (భూ యజమాని)కు వస్తే కౌలు రైతుకు రాదు, కౌలు రైతుకు వస్తే రైతుకు రాదు’ అని కుండబద్ధలు కొట్టారు. ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే వచ్చేలా, ఓవర్‌లాప్స్‌ కాకుండా ఉండేందుకు మొత్తం రికార్డులను కంప్యూటీకరిస్తామని కూడా రేవంత్‌రెడ్డి ఆ ఇంటర్వ్యూలో ప్రకటించారు. రైతుభరోసా రాని కౌలు రైతులకు ఉపాధి కూలీల పథకం కింద సాయం అందిస్తామని తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రకటించిన రైతు భరోసా వల్ల అటు కౌలు రైతు కూలీగా మారటం.. ఇటు సాగు లేక భూములు పడావు పడటం ఖాయం. ఇదే ఆ పథకం గొప్పతనం. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు డబ్బుతోపాటు భూమిని కౌలుకు ఇస్తే వచ్చే కౌలు కూడా భూ యజమానికి లభిస్తున్నది. అదే సమయంలో సాగుచేసుకొనేందుకు కౌలు రైతులకు పుష్కలంగా భూమి లభిస్తున్నది. ఈ విధంగా కౌలు రైతు కూడా బాగుపడుతున్నాడు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో రైతుల మధ్య కొట్లాటలు పెట్టే విధంగా కాంగ్రెస్‌ రైతు భరోసా ఉన్నదని పలువురు రైతులు మండిపడుతున్నారు.

Latest News

More Articles