Sunday, April 28, 2024

నేను కలలుగన్న తెలంగాణ అదే.. తెలంగాణమా ఆలోచించు.. కేసీఆర్ ఎమోషనల్

spot_img

హైదరాబాద్: ‘‘నేను కొట్లాడేది పదవి కోసం కాదు. వందశాతంపేదరికం లేని తెలంగాణ కావాలి. అదీ నా పంతం. రైతాంగం గుండెమీద చెయ్యేసుకుని హాయిగా నిద్రపోయేలా బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. అది నా స్వప్నం. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి. కేరళ రాష్ట్రం మాదిరిగా వందశాతం అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం కావాలి. ఇది నా కల’’ అని ఆదివారం జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎమోషనల్ అయ్యారు.

58 ఏండ్లు గొడగొడ ఏడ్చింది తెలంగాణ. మంచినీళ్లు లేవు. సాగునీళ్లు లేవు. కరెంటు సక్కగరాదు. దుబాయికి వలసబోయిన బతుకులు. చేనేతల కార్మికుల ఆకలిచావులు, రైతులు ఉరిపోసుకుని సచ్చుడు.. ఎంతటి భయంకరమైన పరిస్థితులవి అంటూ ఆనాటి తెలంగాణ ముఖ చిత్రాన్ని కేసీఆర్ చెబుతుంటే.. నిజమే కదా తెలంగాణ ఎంత దుఃఖపడ్డది అని అందరూ గుర్తుచేసుకున్నారు. సమైఖ్య పాలనలో చెల్లాచెదురైన తెలంగాణను ఒక్కతాటిపైకి తెచ్చిండు కేసీఆర్‌. చీలికపేలికలైన సబ్బండవర్ణాలను ఐక్యం చేసిండు. మట్టినీ, మింటినీ ఏకం చేసిండు. గల్లీ గల్లీని నడిపించి.. ఢిల్లీని కదిలించిండు.  ‘ఉద్యమబాట వీడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి’ అని ప్రకటించి అదే మాట మీద నడిచి, గెలిచిన మొనగాడు కేసీఆర్‌. జనం విశ్వసించారు. వెంటనడిచారు.

అప్పటికీ, ఇప్పటికీ కేసీఆర్‌ ఆత్మ తెలంగాణ. ఇప్పుడెట్లా అయ్యింది తెలంగాణ..? సాధకుడే పాలకుడైతే పదేండ్లలో బంగారపు తునకైంది రాష్ట్రం. అస్తిత్వంకోసం పోరాడిన తెలంగాణ.. నేడు అభివృద్ధితో, ఆత్మగౌరవంతో మెరుస్తున్నది. గడిచిన రోజుల్ని మరువొద్దు. నడిచిన దారినీ మరువొద్దు. ఎన్నికల ప్రచారంలో ‘మాకు ఓటేయండి’ అని అడిగే నేతల్ని చూశాంగానీ, ‘ఆలోచించి ఓటేయండి’ అనే నాయకుడు కేసీఆర్‌. ‘ప్రజల్ని నేను కోరేది ఒక్కటే. పార్టీల వైఖరి, నాయకుల సరళి అన్నీ ఆలోచించి ఓట్లేయాలె. ఆగం కావొద్దు. రాష్ర్టాన్ని ఆగం చేయొద్దు.’ అని కోరుతున్నారు తెలంగాణ బాపు కేసీఆర్. తెలంగాణమా ఒకసారి ఆలోచించు. తెలంగాణ రాబోయే 5 ఏండ్ల భవిష్యత్ మీ చేతిలో ఉంది. ఆగమైతే గోసపడతాం.

Latest News

More Articles