Saturday, May 18, 2024

ఏపీ స్కిల్‌ స్కాం కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు

spot_img

అమరావతి : ఏపీ స్కిల్‌ స్కాం కేసులో మంగళవారం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ప్రభుత్వం తరుఫున ఈ కేసు తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఎవరూ కూడా మాట్లాడవద్దని ఆదేశించింది. క్వాష్‌ పిటిషన్‌ తీర్పు తర్వాతే విచారణ చేస్తామని తెలిపింది. సీఐడీ పిటిషన్‌పై డిసెంబర్‌ 8కి విచారణను వాయిదా వేసింది.

Also Read.. గోయల్ కు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి. లేదంటే పరువు నష్టం దావా వేస్తాం

స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టు అనంతరం హైకోర్టు బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా బెయిల్‌ రద్దు కోరుతూ ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారించింది. బెయిల్‌ రద్దుపై వెంటనే విచారణ చేపట్టేందుకు కోర్టు నిరాకరించింది. అలాగే చంద్రబాబును రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.  డిసెంబర్‌ 8లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని బాబుకు నోటీసులు జారీ చేసింది.

Latest News

More Articles