Friday, May 10, 2024

గోయల్ కు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి. లేదంటే పరువు నష్టం దావా వేస్తాం

spot_img

హైదరాబాద్: ఏకే గోయల్ ఇంట్లో డబ్బులు దాచారని కాంగ్రెస్ ఆరోపణలు చేసిందని, ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ వెతికినా ఏమి దొరకలేదని, ఇది కాంగ్రెస్ చేసిన దుర్మార్గ మైన చర్య అని బీఆర్ఎస్ లీగల్ హెడ్ సోమా భరత్ ఆరోపించారు. గోయల్ ఇంటి ముందు విజయ రెడ్డి, మల్లు రవి, అజహరుద్దీన్ లు చేసింది నీచమైన చర్యగా ఆయన అభివర్ణించారు. గోయల్ పరువు ను బజారుకీడ్చారని మండిపడ్డారు. అనుమతి లేకుండా ధర్నా చేసినందుకు పోలీసులు కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ గోయల్ కు క్షమాపణ చెప్పాలి. లేదంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. సమాజంలో గౌరవంగా బతుకుతున్న గోయల్ ఇంటిపై దాడి చేయడం కాంగ్రెస్ సంస్కృతి ని ప్రతిబింబింస్తుందన్నారు. సీనియర్ సిటిజన్ ఇంటి వద్ద మూడు వందల మంది దాడి చేయడం కరెక్టా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కంపైంట్ చేసిన గంటలోపే పోలీసులు సోదాలు చేశారని, ఆయన ఇంటి వద్ద సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు తీసుకెళ్లారన్నారు. తాము అక్కడి నుంచి డబ్బులు తరలిస్తే అందులో అందరూ చూడవచ్చని పేర్కొన్నారు.

నెహ్రూ, ఇందిరా , రాజీవ్ గాంధీ లు ఉన్నపుడు ఇలాంటి సంస్కృతి ని చూడలేదని, ఒక సీనియర్ సిటిజెన్ పట్ల కాంగ్రెస్ ఇలా వ్యవహారించవచ్చా అని ఏకే గోయల్ నిలదీశారు.

Latest News

More Articles