Saturday, April 27, 2024

జరిగిన అభివృద్ధిని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను గుర్తుచేసుకోని.. వెళ్లి ఓటెయ్యాలి

spot_img

రంగారెడ్డి: దేశంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ప్రత్యామ్నాయంగా బిఆర్ఎస్ పార్టీ మారిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సీఎం కాబోతున్నారని గ్రహించి తెలంగాణపై ఆ పార్టీ అగ్ర నేతలు దండయాత్ర చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. ఓటు వేయడానికి వెళ్లే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను గుర్తుంచుచేసుకోని.. వెళ్లి ఓటెయ్యాలని కోరారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

Also Read.. హైద‌రాబాద్ న‌గ‌రంలా వ‌రంగ‌ల్. బీసీ బిడ్డలను గెలిపించాలి

‘‘మహేశ్వర నియోజకవర్గంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో  తాను చేసిన అభివృద్ధి  నన్ను గెలిపిస్తుంది. పెరిగిన నిత్యావసర ధరలు.. గ్యాస్ సిలిండర్ పై పెరిగిన ధర గుర్తుచేసుకొని ఓటేయాలి. ముఖ్యమంత్రి గా మరోసారి కెసిఆర్ కాగానే 400 కి గ్యాస్ సిలిండర్ అందిస్తాం. మహేశ్వర నియోజకవర్గంలో 2000 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మహేశ్వరం నియోజకవర్గం అందించాను. విద్యాపరంగా నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు డిగ్రీ కాలేజీలు డైట్ కాలేజీ లా కాలేజీ ఏర్పాటు చేశాము.

Also Read.. అసెంబ్లీ ఎన్నికలు: రెండు రోజులు స్కూళ్లకు సెలవు

బడంగ్పేట్ మీర్పేట్ జలపల్లి మున్సిపాలిటీలో తోపాటు నియోజకవర్గంలో ఇంటింటికి ఇంటింటికి తాగునీరు డ్రైనేజీ రోడ్ల సౌకర్యాన్ని కల్పించాను. గత పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రం జరగనంత అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల జరిగింది. తాను మహేశ్వరం నియోజకవర్గం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించాను. నేను చేసిన అభివృద్ధి తోపాటు తమ ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారులు అందరు కూడా బిఆర్ఎస్ పార్టీని గుర్తుంచుకొని ఓటు వేయండి. తమ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని ప్రజలంటున్నారు.. ప్రజలనుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.’’ అని అన్నారు.

Latest News

More Articles