Sunday, April 28, 2024

హైద‌రాబాద్ న‌గ‌రంలా వ‌రంగ‌ల్. బీసీ బిడ్డలను గెలిపించాలి

spot_img

వ‌రంగ‌ల్ : హైద‌రాబాద్ న‌గ‌రంలా వ‌రంగ‌ల్ త‌యారు అవుతుందని, భ‌విష్య‌త్‌లో ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌కు వ‌రంగ‌ల్ ఆల‌వాలం కాబోతుందని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. వ‌రంగ‌ల్ ఈస్ట్, వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ ఇద్ద‌రు టైగ‌ర్ల‌ను గెలిపించేందుకు.. ఈ వ‌రంగ‌ల్‌లోనే ఆకాశాన్నే ముద్దు పెట్టుకుంటా అని లేస్తున్న 24 అంత‌స్తుల బిల్డింగ్ చాలదా..? ఆ ఒక్క హాస్పిట‌ల్ బిల్డింగ్ చాల‌దా.. ఇద్ద‌రిని గెలిపించ‌డానికి. ఇంత‌కుముందు ఆ ముక్కిపోయిన ఎంజీఎంలో ప‌డి ఏడ్సినం. ఎంజీఎం అది త‌ప్ప ఇంకోటి లేకుండే అని కేసీఆర్ గుర్తు చేశారు. వ‌రంగ‌ల్ ఈస్ట్, వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు క‌లిపి ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని.. దాస్యం విన‌య్ భాస్క‌ర్, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు.

ఇది కూడా చదవండి: ఆరేండ్ల బాబుకు హార్ట్ఎటాక్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

ఆటో రిక్షా కార్మికుల క‌ష్టం గుర్తించి జీరో ట్యాక్స్ చేశాం. కానీ మీకు ఒక స‌మ‌స్య ఉంది. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన వెంట‌నే ఫిట్‌నెస్, ప‌ర్మిట్ స‌ర్టిఫికెట్‌ ఛార్జీలను ర‌ద్దు చేస్తాము. విన‌య్ భాస్క‌ర్, న‌రేంద‌ర్ వీళ్లిద్ద‌రూ కూడా బీసీ బిడ్డ‌లు. వ‌రంగ‌ల్‌లో ఉండే బీసీ మేధావులు, ప్రొఫెస‌ర్లు, టీచ‌ర్లు, అంద‌ర్నీ అప్పీల్ చేస్తున్నా.. ఈ ఇద్ద‌రు బీసీ బిడ్డ‌ల‌ను గెలిపించే బాధ్య‌త బీసీల‌దే. అంద‌రూ ఏకమై ఇద్ద‌రికి భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపాలని కోరారు. కాంగ్రెస్ పార్టీవ‌ల్లే వ‌రంగ‌ల్ అభివృద్ధి కుంటు ప‌డిందన్నారు మ‌ళ్లీ ఇప్పుడు అభివృద్ధి జ‌రుగుతుందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ హవా ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులవి ఉత్తమాటలె..

కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీ గెలిస్తే మళ్ల ఇందిరమ్మ రాజ్యం తెస్తం అంటున్నరు. ఇందిరమ్మ రాజ్యం అంత దరిద్రపు రాజ్యం ఇంకోటి లేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో అరాచకాలు జరిగినయ్‌. తెలంగాణ కోసం ఉద్యమించిన 400 మందిని కాల్చిచంపిండ్రు. ఎమర్జెన్సీ పెట్టి అందర్నీ జైళ్లల్ల పెట్టిండ్రు. అసుంటి రాజ్యం మళ్ల గావాల్నా..? కాంగ్రెస్‌ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి 58 ఏండ్లు మనలను గోసపెట్టింది. కొట్లాడంగ, కొట్లాడంగ ఆఖరికి తెలంగాణ ఇచ్చిండ్రు. తెలంగాణ ఏర్పడంగనే బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఆసరా పెన్షన్‌లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతబంధు, రైతుబీమా లాంటి పథకాలు తీసుకొచ్చినం. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా తాము నిర్ణయాలు చేసినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

Latest News

More Articles