Sunday, May 5, 2024

బీఆర్ఎస్ హవా ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులవి ఉత్తమాటలె..

spot_img

నియోజకవర్గంలో జరిగిన అభివృద్దే నా ప్రచార అస్త్రాలు అని సూర్యపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కార్యకర్తలే తన ప్రచార రథసారథులు అని, ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. రైతుబంధు ఆపడం దురదృష్టకరం అన్నారు. రైతుబంధు ఆపింది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలేనని తేల్చిచెప్పారు. రైతులు బాధపడాల్సిన అవసరం లేదని, ఎన్నికల ప్రక్రియ ముగిశాక యధావిధిగా అందరికీ రైతుబంధు నిధులు వస్తాయని భరోసానిచ్చారు. సీఎం కేసీఆర్ ఏ తప్పు చేయలేదని, జైళ్లలో ఉండి జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్న వారికే జైలుకు వెళ్లాలని ఆలోచన ఉంటుందన్నారు. కాంగ్రెస్ సునామీని అడ్డుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ హవా ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులవి ఉత్తమాటలుగానే మిగిలిపోతాయన్నారు. మళ్లీ మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని నొక్కి వక్కాణించారు. రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తున్న పార్టీ బీఆర్ఎస్ అన్నారు. సూర్యాపేటతో పాటు
ఉమ్మడి నల్గొండ జిల్లా మళ్లీ బీఆర్ఎస్ కైవసమేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: ఓటీటీలోకి వ‌చ్చేసిన సిద్ధార్థ్ ‘చిన్నా’..

Latest News

More Articles