Saturday, May 4, 2024

24 ఏండ్లుగా తెలంగాణ ఆశ‌గా, శ్వాస‌గా బ‌తుకుతున్నాను

spot_img

గ‌జ్వేల్ : గ‌త 24 ఏండ్లుగా తెలంగాణ ఆశ‌గా, శ్వాస‌గా బ‌తుకుతున్నాన‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. గ‌జ్వేల్ నుంచి మీరు అవ‌కాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిని చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం క‌ష్ట‌ప‌డ్డాను, కృషి చేశాను. అవ‌న్నీ ప్ర‌జ‌ల కండ్ల ముందు క‌న‌బ‌డుతున్నాయన్నారు. గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కేసీఆర్ పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.

Also Read.. ఇందిర‌మ్మ రాజ్యం ఎవ‌రికి కావాలి ఇప్పుడు..? కేసీఆర్ ఫైర్

తెలంగాణ రాష్ట్రం గురించి కూడా ఒక‌సారి చెప్పాలి. గ‌జ్వేల్ నుంచి మీరు అవ‌కాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిని చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం క‌ష్ట‌ప‌డ్డాను. కృషి చేశాను. అవ‌న్నీ ప్ర‌జ‌ల కండ్ల ముందు క‌న‌బ‌డుతున్నాయి. ఇక్క‌డ వ‌చ్చేట‌టువంటి ట్రిపుల్ ఆర్ కూడా మ‌న గ‌జ్వేల్ మీదుగానే రాబోతుంద‌ని సంతోషంగా తెలియ‌జేస్తున్నా. 24 ఏండ్లుగా తెలంగాణ‌నే ఆశ‌గా, శ్వాస‌గా బ‌తుకుతున్నాను. ఆ విష‌యం మీ అంద‌రికి తెలుసు అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: అన్నీ తానై.. అటు ప్రచారపర్వం, ఇటు పార్టీ వ్యూహరచన.. కేటీఆర్ అలుపెరగని ప్రచారం

తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు నాకు బలాన్ని ఇచ్చిన గడ్డ సిద్దిపేట. ఆ తర్వాత.. సాధించిన తెలంగాణను తీర్చిదిద్దడం కోసం నన్ను ఎమ్మెల్యేను చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన గడ్డ ఈ గజ్వేల్‌ గడ్డ. గజ్వేల్‌ నా గౌరవాన్ని పెంచింది. గత తొమ్మిదిన్నర ఏండ్లుగా నేను గజ్వేల్‌ ప్రాంతం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశాను. గతంలో మంచి నీళ్ల కోసం నానా ఇబ్బందులు పడిన గజ్వేల్‌కు శాశ్వతంగా ఆ బాధ తీరిపోయింది. సాగు నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడిన గజ్వేల్‌కు ప్రాజెక్టులు, కాలువలు రావడంతో ఆ బాధ కూడా తీరిపోయిందన్నారు.

ఇది కూడా చదవండి: జరిగిన అభివృద్ధిని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను గుర్తుచేసుకోని.. వెళ్లి ఓటెయ్యాలి

మన గజ్వేల్‌కు రైలు వస్తదని ఎన్నడూ అనుకోలేదు, కానీ రైలు కూడా వచ్చేసింది. గజ్వేల్‌ ఒక గుర్తింపు కలిగిన నియోజకవర్గంగా ఎదిగింది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి గజ్వేల్‌ మోడల్‌ అభివృద్ధిని చూడటానికి వస్తున్నరు.  మిషన్‌ భగీరథ పథకాన్ని గురించి తెలుసుకోవడానికి కోమటిబండకు రాని రాష్ట్రమే లేదు భారత దేశంలో. అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పుడు మనం తాగుతున్నది, సాగుకు వినియోగిస్తున్నది మనందరం ఎంతో పవిత్రంగా భావించే గోదావరి జలాలు. ఇలా ఒక రోల్‌ మోడల్‌గా గజ్వేల్‌ ఎదిగింది. ఇంకా చాలా అభివృద్ధి కావాల్సి ఉందని సీఎం చెప్పారు.

Latest News

More Articles