Sunday, May 12, 2024

క్షమాపణ చెప్పిన విశాల్

spot_img

క్రిస్మస్, న్యూ ఇయర్ జరుపుకోవడానికి అమెరికా వెళ్లిన కోలీవుడ్ న‌టుడు విశాల్ అక్క‌డ న్యూయార్క్‌ వీధుల్లో ఓ అమ్మాయితో కలిసి నడుస్తూ మొహం దాచుకుంటున్న‌ట్లు కనిపించే వీడియో సోష‌ల్ మీడియాలో  వైర‌ల్ అవుతున్నది. అయితే ఈ వీడియో పోస్ట్ పై నెటిజ‌న్లు ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఈ వివాదం ముదురుతున్న నేప‌థ్యంలో విశాల్ ఎక్స్(ట్విటర్) వేదిక‌గా స్పందించాడు.

”అందరూ నన్ను క్షమించాలి. ఆ వైరల్ వీడియో కొంచెం నిజం, కొంచెం ప్రాంక్.  ఏటా మా కజిన్స్‌తో అమెరికాకు వెళ్లి సరదాగా గడుపుతుంటా. వీడియోలో నేను మొహం ఎందుకు దాచుకున్నానంటే.. అదొక ప్రాంక్‌. ఇది చిలిపి ప‌ని అని తెలుసు. కానీ అలా చేయ‌డం వ‌ల‌న నాలోని చిన్నతనం గుర్తొచ్చింది. ఈ వీడియోతో ఎవ‌రిని హ‌ర్ట్ చేయ‌లని కాదు.” అంటూ విశాల్ తన క్షమాపణ ట్వీట్ లో రాసుకొచ్చారు.

Latest News

More Articles