Sunday, May 19, 2024

అప్పు కాదది.. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడి

spot_img

హైదరాబాద్: మన దళిత బంధు ద్వారా మన దళిత బిడ్డలు ఒక్క రూపాయ ద్వారా 10 రూపాయిలు సంపాదించే విధముగా ఉండాలి, మరో నలుగురికి ఉద్యోగం కల్పించే విధముగా ఉండాలి అని సీఎం కేసీఆర్ చెప్పారని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. దళిత బంధు 100 శాతం విజవంతం అయిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిందన్నారు. సోమాజిగూడ లోని పార్క్ హోటల్ దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Also Read.. చెన్నూరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరనీయం.. వివేక్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిండని ప్రతిపక్షాలు అంటున్నాయని, అమెరికా, జపాన్ ప్రపంచంలోనే సంపన్న దేశాలో కూడా అప్పులు చేయడం సర్వసాధారణం అన్నారు. అప్పు చేసి తాము సంపద సృష్టించే వాటిల్లో పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో కరెంట్, నీళ్లు లేవని.. విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కోసం అప్పు చేసామన్నారు. స్వతంత్రము వచ్చిన తరవాత దేశంలోనే తొలిసారిగా ఇంటింటికి స్వచ్ఛమైన ముంచి నీరు ఇవ్వడం జరిగిందన్నారు.

Also Read.. మెదక్ లో రోడ్డుప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్ట్ కట్టినాము. వీటి వలన ధాన్యం ఉత్పత్తి 3కోట్లు టన్నులకు చేరుకుంది. మనం తెచ్చింది అప్పు కాదని, భవిష్యత్ తరాల కోసం పెట్టుబడి అని చెప్పారు. ఎప్పుడు సంపద పెరగాలి, దానిని పేదలకు పంచాలని సీఎం కేసీఆర్ చెబుతుంటారని పేర్కొన్నారు. మన హైదరాబాద్ నగరాన్ని చూసి ఇటీవల కొందరు సెలబ్రిటీలు న్యూయార్క్ కి పెద్ద తేడా లేదని చెబుతున్నారని తెలిపారు.

Also Read.. నేను హామీ.. చేనేత మిత్రను 5 వేలు చేస్తాం

ప్రతి జిల్లాలకు ఒక్క మెడికల్ కాలేజీ పెట్టినాం. ఎస్సి, ఎస్టీ విద్యార్థులకు కూడా మెడికల్ సీట్లు వస్తున్నాయి. 11 సార్లు కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే ఒక్కసారి కూడా దళిత బంధు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ కట్టాలని దేశంలోని ఏ నాయకుడికి ఎందుకు ఆలోచన రాలేదు. చరిత్ర పైనా చరగని ముద్ర వేస్తేనే నాయకుడు అవుతారు. ఇప్పుడు కాకపోయినా ఇంకో 100 సంవత్సరాలు తరవాత అయినా తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే సీఎం కేసీఆర్ అని రాస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఓట్లు వేయాలని సూచించారు. ఈసారి హైదరాబాద్ లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని కోరారు.

Latest News

More Articles