Sunday, May 12, 2024

మలక్ పెట్ లో టీవీ టవర్ ని మరిపించేలా ఐటీ టవర్.. తనది బాధ్యత: కేటీఆర్

spot_img

హైదరాబాద్: తెలంగాణ రాకముందు కరెంట్ కోతలు, జనరేటర్ లు, ఇన్వెర్టుర్లు ఉండేవని, తెలంగాణ వచ్చాక 24 గంటల కరెంట్ ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మలక్ పెట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగల అజిత్ రెడ్డి కి మద్దతుగా ముసారాంబాగ్ వద్ద మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.  మలక్ పెట్ లో టీవీ టవర్ ని మరిపించేలా ఐటీ టవర్ తీసుకువచ్చే బాధ్యత తనదని పేర్కొన్నారు. ఇంకా ఈ ప్రాంతంలో రెండు ప్లై ఓవర్లు నిర్మించాల్సి ఉందన్నారు.

బలమైన నాయకత్వం స్థిరమైన ప్రభుత్వం వల్ల హైదరాబాద్ లో పెద్ద పెద్ద కంపెనీల పెట్టుబడులు పెడుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ లో మలక్ పెట్ లో కర్ఫ్యూ లు ఉండేవి. కేసీఆర్ వచ్చాక కర్ఫ్య్ లేదు. కరువు లేదన్నారు. హిందు ముస్లిం అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉంటున్నాము. అభివృద్ధి తమ కులం.. సంక్షేమం తమ మతం అనే నినాదంతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. సినిమా స్టార్ రజినీ కాంత్ ఇటీవల హైదరాబాద్ డెవలప్ మెంట్ ను చూసి న్యూయార్క్ లా ఉందన్నారు. కానీ ఇక్కడి ప్రతిపక్షాలకు మాత్రం ఇక్కడి అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని సెటైర్లు వేశారు.

ఇది కూడా చదవండి: ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్

2014 లో మోడీ జన్ దన్ ఖాతా తెరిస్తే 15 లక్షలు ఇస్తామని చెవిలో పువ్వు పెట్టాడని విమర్శించారు. మోడీ హయాంలో 400 రూపాయలు ఉన్న సిలిండర్ 1200 రూపాయలు అయిందన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయ్యాక 400 రూపాయలకే సిలిండర్ ఇస్తామని పేర్కొన్నారు. నెలకు 3 వేల రూపాయలను సౌభాగ్యాలక్ష్మి పథకం కింద మహిళలకు అందిస్తామన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లకు సన్నబియ్యం అందిస్తామని చెప్పారు. కార్డులు లేని వారికి జనవరిలో కొత్త కార్డులు అందజేస్తామని తెలిపారు. కేసీఆర్ బీమా 5 లక్షల జీవిత భీమా అందిస్తామన్నారు. కేసీఆర్ నాయకత్వం లో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, ఇంకా కొన్ని పనులు చేసుకోవాల్సి ఉందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి అజిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

Latest News

More Articles