Friday, May 17, 2024

ఢిల్లీ నుండి వచ్చే సీల్డ్ కవర్ సిఎంలు మనకు అవసరమా?

spot_img

పరిగి: పాలమూరుకు నీరు రాలేదంటున్న కాంగ్రెస్ సన్నాసులు ప్రశ్నించడం హాస్యాస్పదం, కాంగ్రెస్ నేతలు కేసులు వేయకుంటే ఇప్పటికే పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయ్యేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్, కృష్ణా నీరు ఎందుకు తేలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో హరీశ్వర్ రెడ్డన్న ఎంతో కృషి చేశారని కొనియాడారు. హరీశ్వర్ రెడ్డి ఆత్మ శాంతించాలంటే కొప్పుల మహేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Also Read.. పది హెచ్‌పీ మోటర్‌ కాంగ్రెసోడు కొనిస్తడా? మళ్లీ గోల్‌మాల్‌ అవుదామా?

ఒక్క కేసీఆర్ ను కొట్టడం కోసం ఎంతో మంది వస్తున్నారు. ఎంత మంది వచ్చిన భయం లేదు. సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది. ఢిల్లీ నుండి వచ్చే సీల్డ్ కవర్ సిఎంలు మనకు అవసరమా? జానారెడ్డి కూడా సిఎం అవుతాను అంటున్నాడు. కాంగ్రెస్ వస్తే ఆరు గ్యారంటీలు ఎమోగాని.. 6 నెలలకు ఒక సీఎం చొప్పున 10మంది సీఎంలు కావడం ఖాయం. కాంగ్రెస్ లో అందురు సిఎంలే అని ఎద్దేవా చేశారు. నవంబర్ 30 నాడు గులాబీ జెండా పాతాలని, కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు.

Also Read.. కాంగ్రెస్‌ నేతల గోల్‌మాల్ మాటలు నమ్మి మోసపోవద్దు.. ఆగం కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి

రాబోయే రోజుల్లో తాము కొత్తగా నాలుగు కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాము. తెల్ల కార్డు ఉన్న 93 లక్షల కుటుంబాలకు ఐదు లక్షల జీవిత బీమా అంజేస్తం. కేసీఆర్ భరోసా కింద మరెన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము. హనుమంతుని గుడి లేని ఊరు లేదు..కేసీఆర్ సంక్షేమం అందని గడప లేదు. 50 కంటే ఎక్కువ తండాలను ఇక్కడ గ్రామ పంచాయతీలను చేసాము. 6 శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్ ను 10 శాతం పెంచుకున్నము. ప్రతి తండాలో సేవాలాల్ భవనం కట్టే బాధ్యత మాది. ప్రతి గ్రామంలో మహిళా భవనం కట్టిస్తాము. కొద్ది రోజుల్లోనే పాలమూరు రంగారెడ్డి నీరు పరిగి, కుల్కచర్లకు వస్తుందన్నారు.

Also Read.. వివాదంలో మునుగోడు బిజెపి అభ్యర్థి.. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన బాధితులు

పిల్లను ఇస్తనే ఎంతో ఆలోచిస్తాము. అలాంటిది రాష్ట్రాన్ని వారి చేతిలో ఎలా పెడతాము. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక లో కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ముదిరాజ్ కులస్తులకు త్వరలోనే మంచి శుభవార్త వింటారు. కేసీఆర్ మీటింగ్ పెట్టి ఆ శుభవార్త చెబుతారు. సోనియా, రాహుల్ మీద ఈడీ కేసు ఉంది. మిమ్మల్ని అరెస్ట్ చేశారా..అంటే మీరు బిజెపికి బి టీమా? కాంగ్రెస్ మనల్ని ఓట్లు వేసే మిషన్లు గానే చూసారు. కానీ కేసీఆర్ మనల్ని మానవత్వంతో చూసారు. మంచిగా పని చేసినప్పుడు మూడోసారి అధికారం ఇస్తే తప్పేంటి? ఇక్కడి వాళ్లకు చేతకాక పక్క రాష్ట్ర నాయకులను తెచ్చుకుంటున్నారు. ఇక్కడ అభివృద్ధిని నేను చూసుకుంటాను..మీరు కొప్పుల మహేష్ రెడ్డిని గెలిపించాలని కేటీఆర్ కోరారు.

Latest News

More Articles