Friday, May 17, 2024

ముచ్చటగా మూడోసారి తెలంగాణలో గులాబీ జెండా

spot_img

హైదరాబాద్: ముచ్చటగా మూడోసారి తెలంగాణలో గులాబీ జెండా ఎగరబోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఎంత స్థితప్రజ్ఞత కలవారో  గతంలో రెండుసార్లు ఎన్నికల్లో  రుజువు అయ్యిందన్నారు.  కొనసాగుతున్న అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే అది బీఆరెస్ ప్రభుత్వం వల్లే సాధ్యమని ప్రజలకు బాగా తెలుసన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందో, ఏం చేయగలదో, అంతా ప్రజలకు తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు.  తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంకలనం చేసిన, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విశ్లేషణ ‘‘కాంగ్రెస్ చేసిందేంది?’’ అనే పుస్తకాన్ని సోమవారం నాడు ప్రగతి భవన్ క్యాంపు ఆఫీసులో ఆవిష్కరించారు కేటీఆర్.

Also Read.. షర్మిలకు బిగ్ షాక్.. బీఆర్‌ఎస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం

తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కాంగ్రెస్ వల్ల కాదు. డిసెంబరు 3వ తేదీన తెలంగాణ అంతా పింక్ మయం కాబోతుందని ధీమా వ్యక్తం చేసారు కేటీఆర్. బీఆర్ఎస్ అంటే  తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వానికి ఆత్మ. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న తెలంగాణ పునర్నిర్మాణధారి కేసీఆర్ ను ప్రజలు గెలిపించుకుంటారు. తెలంగాణను ధ్వంసం చేసెందెవరో? తెలంగాణను పునర్నిర్మిస్తుందెవరో తెలంగాణ మట్టికి తెలుసు. కాంగ్రెస్ ఎన్ని టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలను ప్రదర్శించినా, ఈ గోల్ మాల్ కాంగ్రెసును ప్రజలు నమ్మరని తెలిపారు.

Also Read.. ఢిల్లీ నుండి వచ్చే సీల్డ్ కవర్ సిఎంలు మనకు అవసరమా?

తెలంగాణ కన్నీళ్ళను తుడిచి బీడు భూములపై గంగమ్మను ప్రవహింపచేస్తున్న కేసీఆర్ ను తెలంగాణ తన గుండెల్లో దాచుకుంటుంది.  చెరువుల్ని చంపి, అడవుల్ని ధ్వంసం చేసి, ప్రగతి నిరోధకంగా మారి,  గ్రామస్వరాజ్యాలను నిర్వీర్యం చేసి 60 ఏళ్ళు తెలంగాణను నిస్తేజంగా మార్చిన కాంగ్రెస్ అసలు రంగు ప్రజలకు బాగా తెలుసు.  కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు పన్నినా 30 వ తేదీన బ్యాలెట్ బాక్సుల్లో బీఆర్ఎస్ విజయం పదిలం. తెలంగాణను చీకట్లలో ముంచిన కాంగ్రెస్ ను, తెలంగాణను వలవలా ఏడ్పించిన కాంగ్రెసును ప్రజలు తిప్పికొడతారని పేర్కొన్నారు.

Also read.. వివాదంలో మునుగోడు బిజెపి అభ్యర్థి.. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన బాధితులు

కాంగ్రెస్ పాలనలో ఎండిన భూములు, రాష్ట్రం నుంచి లక్షల సంఖ్యలో వలసలు కొనసాగాయి. బీఆర్ఎస్ పాలన  పసిడి పంటల తెలంగాణగా వర్థిల్లుతోంది. కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ మొత్తం సంక్షోభంలో కూరుకుపోగా బీఆర్ఎస్ అధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మించబడుతూ దేశానికే మోడల్ గా మారింది.  కాంగ్రెసు వ్యవహారాన్ని కళ్ళకు కట్టినట్లుగా పుస్తకాన్ని వెలువరించిన జూలూరు గౌరీశంకర్ ను కేటీఆర్ అభినందించారు.

Latest News

More Articles