Saturday, May 11, 2024

‘ప్రజాపాలన’కు దరఖాస్తు చేసుకున్న శివుడు.. సోషల్ మీడియాలో వైరల్

spot_img

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం నిన్న శనివారంతో ముగిసింది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన పథకాల కోసం ప్రజల నుండి దరఖాస్తు పత్రాలను స్వీకరించింది. దాదాపు 1.30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: రూ. 15 లక్షలు ఇస్తేనే ఫస్ట్ నైట్.. వరుడి బెదిరింపు

ఈ క్రమంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అక్కడ వచ్చిన దరఖాస్తుల్లో ఏకంగా పరమ శివుడి పేరిట దరఖాస్తు అధికారులకు అందింది. అందులో అర్జీదారు శివుడు కాగా, కుటుంబ వివరాల కాలమ్‌లో భార్య పేరు పార్వతీ దేవి, కుమారుల పేర్లు కుమార స్వామి, వినాయకుడు అని రాసి ఉంది. ఈ దరఖాస్తును అదే గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి ఇచ్చినట్లుగా ఆయనే చెప్పారు. తమ గ్రామంలో ఉన్న పురాతన శివాలయం అభివృద్ధికి నోచుకోవడం లేదని, అందుకే ఈ విధంగానైనా దరఖాస్తు చేస్తే, అధికారులు పట్టించుకుంటారని ఇలా చేశానని ఆయన చెబుతున్నారు. ఏది ఏమైనా ఒక పథకాన్ని అవమానపరిచేలా ఇలా చేయడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సురేందర్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని అంటుండగా.. గ్రామస్తులు మాత్రం దేవాలయ అభివృద్ధి కోసమే ఇలా చేశాడని మద్దతు పలుకుతున్నారు. ప్రస్తుతం ఈ దరఖాస్తు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest News

More Articles