Saturday, May 18, 2024

ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం

spot_img

ఫిలిప్పీన్స్ లో ఇవాళ(శుక్రవారం) భారీ భూకంపం వచ్చింది. ఒక్కసారిగా వచ్చిన ఈ భూ ప్రకంపనలతో అక్కడి జనం భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు తమ ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రకంపనల దాటికి పలు భవనాల పైకప్పులు కూలిపోయాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.7గా నమోదు అయ్యిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

ప్రధాన దక్షిణ ద్వీపం మిండనావోలోని సారంగాని ప్రావిన్స్ లో 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిదని, అయితే సునామీ ముప్పు లేదని యుఎస్జీఎస్ తెలిపింది.

ఇది కూడా చదవండి: జైపూర్ లో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం

Latest News

More Articles