Saturday, May 4, 2024

కాంగ్రెస్ కు ఓటేస్తే రాష్ట్రం ఆగమయితది

spot_img

కాంగ్రెస్ కు ఓటేస్తే రాష్ట్రం ఆగమయితదని అన్నారు మంత్రి కేటీఆర్. కోహ్లీ సెంచరీ కొట్టిండు మనం కూడా సెంచరీ కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీరామ నగర్ నుంచి ప్రారంభమైన రోడ్ షో లో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. 3వ తేదీన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపినాథ్ గెలవబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదన్నర సంవత్సరాలు అయ్యింది. హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉంది. ఆడపిల్లలు పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ ఇస్తున్నారు సీఎం కేసీఆర్. అజారుద్దీన్ ఓట్ల కోసం వస్తే క్రికెట్ ఆడండీ, ఓటు మాత్రం మాగంటి గోపినాథ్ కి వేయండని తెలిపారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ కేసీఆరే గెలువాలి

మీ ప్రతీ సమస్యను పరిష్కరించింది మాగంటి గోపినాథ్ అని తెలిపారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కులం, మతం పైనా కుంపట్లు పెట్టలేదన్నారు. కరెంట్ కావాల్నా, కాంగ్రెస్ కావల్నా అనేది మీరే నిర్ణయంచుకోండని తెలిపారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంట్ కష్టాలు, కంపెనీలు మూతపడుతాయన్నారు. మూడువ సారి బీఆర్ఎస్ పార్టీ రాగానే నాలుగు కొత్త పథకాలు ప్రారంభిస్తామని చెప్పారు. తెల్ల రేషన్ ఉన్నవారందరికి శుభవార్త, సీఎం కేసీఆర్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 3 తర్వాత సన్న బియ్యం ఇస్తాం. 5లక్షల జీవిత బీమా ఇస్తాం. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది కాబట్టి పేద పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అలిగిన గులిగిన మన మీదనే అలగాలి.. ఎవడో చేతులో నాయకత్వం పెడితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలాగా మారుతుందన్నారు మంత్రి కేటీఆర్.

సౌభాగ్యలక్ష్మి కింద 3వేల రూపాయలు, పింఛన్ పెంచుతున్నామని తెలిపారు.మోడీ చాలా మాటలు చెప్పాడు. జన్ ధన్ యోజన కింద అకౌంట్లలో 15లక్షలు వేస్తాం అని చెప్పిండు.. వేసిండా మరి అని ప్రశ్నించారు. ఒక్క రిపోర్టర్  మోడీని ఉద్యోగాలు గురించి అడిగితే పకోడీలు వేసుకొనేది కూడా ఉద్యోగమే కదా అంటున్నాడని చెప్పారు.

ఇది కూడా చదవండి: మేడ్చల్‌లో చెల్లని రూపాయి.. మహేశ్వరంలో చెల్లుతుందా

Latest News

More Articles