Sunday, April 28, 2024

మేడ్చల్‌లో చెల్లని రూపాయి.. మహేశ్వరంలో చెల్లుతుందా

spot_img

ఎన్నికల సమయంలోనే కనిపించే ప్రతిపక్షాలకు మరోసారి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి. మేడ్చల్‌లో చెల్లని రూపాయి మహేశ్వరంలో చెల్లుతుందా అంటూ  కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్‌ఆర్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ప్రజల సమస్యలు పట్టించుకోని , కరోనాలో కనిపించని నేతలు నేడు మీ ముందుకు వస్తున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ(శుక్రవారం) మహేశ్వరం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి మాట్లాడారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. డబ్బుల సంచులు నెత్తిన పెట్టుకొని మేడ్చల్‌ నుంచి వచ్చిన కాంగ్రెస్‌ అభ్యర్థికి మహేశ్వరంలో ఓటమి తప్పదన్నారు. గతంలోనూ రెండు సార్లు పోటీ చేసి చిత్తుగా ఓడిన కేఎల్‌ఆర్‌ను మూడోసారి కూడా చిత్తుగా ఓడిస్తానని ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులని, తాను రియల్‌ లీడర్ నని చెప్పారు. రియల్‌ వ్యాపారులు కావాలా, రియల్‌ లీడరు కావాలా ఆలోచించాలని కోరారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

దేశంలో అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దు

Latest News

More Articles