Friday, May 17, 2024

డ్రైవర్ల కుమార్తెలకు స్కాలర్‌షిప్‌ ప్రకటించిన మహీంద్రా కంపెనీ

spot_img

ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తమ కంపెనీలో పనిచేస్తున్న ట్రక్ డ్రైవర్లకు శుభవార్త చెప్పింది. మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (MTBD)లో పనిచేస్తున్న ట్రక్ డ్రైవర్ల కుమార్తెలకు ‘సారథి అభియాన్’ ద్వారా స్కాలర్‌షిప్‌లను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు 10 వేల రూపాయలను స్కాలర్ షిప్‎గా ఇవ్వనుంది. ఈ పథకం కింద మొత్తం 1100 మంది విద్యార్థినిలకు సాయం లభించనుంది. ఈ ఆర్థికసాయం ద్వారా బాలికల జీవితాలు మారే అవకాశముంది. 2014లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు 8,928 మంది ట్రక్ డ్రైవర్ల కుమార్తెలు ఈ స్కాలర్‌షిప్‌ అందుకున్నారు.

Read Also: బీఆర్ఎస్‏లో చేరిన కిషన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, బీజేపీ కార్పొరేటర్

ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కమర్షియల్ వెహికల్స్ బిజినెస్ హెడ్ జలజ్ గుప్తా మాట్లాడుతూ.. ‘మహీంద్రా సారథి అభియాన్ కమర్షియల్ వెహికల్ ఎకోసిస్టమ్‌లో మహిళలకు సాధికారత కల్పించడానికి కట్టుబడి ఉంది. ఈ ప్రోగ్రామ్‌తో ట్రక్ డ్రైవర్ల కుమార్తెలకు పెద్ద కలలు కనే అవకాశాన్ని అందించడం మరియు వారి కెరీర్ లక్ష్యాలను చేరుకోవడానికి వారికి అవసరమైన మద్దతును అందించడం పట్ల మేం సంతోషిస్తున్నాం’ అని అన్నారు.

Read Also: 6 కాదు 60 గ్యారంటీలిచ్చినా కాంగ్రెస్ పార్టీని జనం నమ్మరు

ఈ స్కాలర్‌షిప్ కోసం ఎంపికైన ప్రతి అమ్మాయికి రూ. 10,000 నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయటంతో పాటుగా ఈ విజయానికి గుర్తింపుగా ఒక సర్టిఫికేట్ ద్వారా సత్కరించాలని కంపెనీ ప్రణాళిక చేసింది. మహీంద్రా ట్రక్ మరియు బస్ లీడర్‌షిప్ ఇండియా ఎంపిక చేసిన ప్రదేశాలలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి 24 మధ్య కాలంలో ఈ సన్మానం చేస్తారు.

Latest News

More Articles